బీసీసీఐ(BCCI) ఆదాయం డబుల్ రెక్కలు తొడిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రాబడి ఏకంగా రూ.2200 కోట్లు(2200 CRORERS) పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ.4,360.57 కోట్ల రాబడి రాగా, అది కాస్తా 2022-23 నాటికి రూ.6,558.80 కోట్లకు ఎగబాకిందని బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్(ASHISH SHELLAR) వెల్లడించారు. సోమవారం గోవా(GOA)లో జరిగిన బీసీసీఐ 92వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆయన ఈ వివరాలను తెలిపారు. క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ఏటా రూ.12.5 కోట్లు, పుదుచ్చేరికి ఏటా రూ.17.5 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (INDIAN CRICKETERS ASSOCIATION) ప్రతినిధి ప్రగ్యాన్ ఓఝా ఐపీఎల్(IPL) గవర్నింగ్ కౌన్సిల్(GOVERNING COUNCIL) సభ్యత్వం నుంచి వైదొలిగారు. అయితే ఈ కౌన్సిల్ కు అరుణ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా(AVISHEK DALMIA) ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.
ప్రగ్యాన్ ఓఝా స్థానంలో ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్(INDIAN CRICKTERS ASSOCIATION) ఎన్నుకునే కొత్త వ్యక్తిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లోకి తీసుకోనున్నారు.అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలోగా కొత్త వ్యక్తి ఎన్నిక ప్రక్రియను ఐసీఏ పూర్తి చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ విషయం బీసీసీఐ ఏజీఎంలో చర్చకు రాలేదు.