బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది తమ డైట్‌లో తేనెని ఎక్కువగా యాడ్ చేస్తారు. ఇది ఓ నేచురల్ స్వీటెనర్. దీనిని సరిగ్గా వాడితే కచ్చితంగా బరువు తగ్గుతారు. అంతే కాదు, తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. బరువు తగ్గడానికి, జలుబు నుంచి బయటపడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
తేనెలో విటమిన్ సి, విటమిన్ బి6, కార్బోహైడ్రేట్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బరువుని కంట్రోల్ చేసుకోవాలనుకునే వారికి తేనె బెస్ట్ ఆప్షన్. పరగడుపున గోరువెచ్చని నీటితో తేనెను తీసుకుంటే చాలు. ఇది శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
గార్సినియా కాంబోజియా తేనె మీ జీవక్రియని మెరుగుపరచడంలో సాయపడుతుందని అధ్యయాలు సూచిస్తున్నాయి. ఇది రోజంతా ఎక్కువ శక్తిని ఇస్తుంది.
జీవక్రియను మెరుగ్గా చేసేందుకు తేనెని ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి, ఎక్కువగా తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. ఇది కేలరీలు తీసుకోకుండా చూస్తుంది.
చక్కెరతో పోలిస్తే తేనెలో తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ, తీపి ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలను విపరీతంగా పెంచుకోకుండా ఉండేందుకు దీనిని తీసుకోవచ్చు.
అంటే చక్కెర బదులుగా తేనెని ఉపయోగించడం ద్వారా, మీరు చక్కెర వాడడం కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. కాఫీ, టీ, ఇతర డ్రింక్స్‌లో చక్కెర బదులు తేనె తీసుకోవచ్చు.
తేనెలో ఎక్కువగా ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. తేనెతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచుతుంది. భోజనం తర్వాత ఓ చెంచా తేనె తీసుకోవడం చాలా ముఖ్యం.
శక్తిని పెంచేందుకు తేనె అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎక్కువ సమయం శక్తి ఉంటుంది. దీంతో ఎక్కువసేపు వర్కౌట్ చేయొచ్చు. కాబట్టి, మీ శక్తిని పెంచుకోవడానికి ఉత్తమ మార్గం. వర్కౌట్ చేసే ముందు, ఆ టైమ్‌లో తేనె తీసుకుంటే మంచిది. వర్కౌట్‌కి ముందు తీసుకోవడం వల్ల శక్తిని ఇస్తుంది.
తేనె ఆకలిని దూరం చేస్తుంది. జంక్‌ఫుడ్, స్నాక్స్ తినకుండా కోరికలను కంట్రోల్ చేస్తుంది. ఆహారం తీసుకోకపోయినా.. ఓ చెంచా తేనె శరీరానికి పోషకాహారంలా అవసరమైన శక్తిని ఇస్తుంది.
సేంద్రియ తేనె తీసుకోవడం చాలా మంచిది. దీనిలో పోషకాలు జీవక్రియని వేగవంతం చేసి కొవ్వుని బర్న్ చేస్తాయి. ఇందుకోసం ఫిజికో డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు విధి చావ్లా చెప్పిన దాని ప్రకారం, ఉదయం, రాత్రి పడుకునే ముందు తేనె తినాలి. తేనెలోని కీలక సమ్మేళనాలు ఆకలి కంట్రోల్ చేయడం ద్వారా బరువు తగ్గడానికి సాయపడతాయి. కాబట్టి, బరువు తగ్గడానికి తేనె బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. మీరు దీనిని నీరు, గ్రీన్‌టీలో కలిపి కూడా తీసుకోవచ్చు.