ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో చెక్కుల వినియోగం భారీగా పెరిగింది. పెద్ద మెుత్తంలో డబ్బు చెల్లింపులకు బదులుగా చెక్కులను వాడాల్సి రావటం దీనికి కారణం. అయితే తరచూ చెక్‌బౌన్స్ అయితే మీరు చిక్కుల్లో పడకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి వారు చెబుతున్న కొన్ని కీలక అంశాలు మీకోసం..
ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉండడం. ఇతర బ్యాంకు ఖాతాలు, చెక్కులపై సంతకాలు కూడా ఒక కారణం కావచ్చు. వీటికి తోడు చెక్కుపై పొందుపరిచిన నంబర్ సరిగ్గా లేకపోయినా చెక్కు బౌన్స్ అవుతుంది. అలాగే చెక్ పాడైనట్లయితే సదరు బ్యాంక్ దానిని క్లియర్ చేయదని గుర్తుంచుకోండి. చెక్‌బౌన్స్ కేసులకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద జరిమానా పడొచ్చు. కొన్నిసార్లు జైలుకూ వెళ్లాల్సిరావచ్చు. పదేపదే ఇదే జరిగితే బ్యాంక్ మీ చెక్‌బుక్ రద్దు కూడా చేయొచ్చు. అసలు బ్యాంక్ ఖాతాను కూడా మూసే ప్రమాదమూ ఉంది. లీగల్ నోటీసులు కూడా అందుకోవచ్చు. బౌన్స్ వల్ల పరపతి సమస్యతో బాటు క్రెడిట్ స్కోర్, సివిల్ స్కోర్‌పైనా దీని ప్రభావం పడి భవిష్యత్ రుణాలు పొందటం కష్టమవుతుంది. చెక్కు జారీ చేసేటప్పుడు ఖాతాలో తగినంత నగదు ఉందో లేదో చెక్ చేయాలి.బ్యాంకులో ఉన్న సంతకమే చెక్ మీద కరెక్టుగా ఉందో లేదో సరిచూసుకోవాలి. చెక్కుపై నింపిన వివరాలు సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.