స్కిల్ డెవలప్మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో టీడీపీ అధినేత(TDP CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని హిందూపురం ఎమ్మెల్యే(HINDUPURAM MLA) నందమూరి బాలకృష్ణ(NANDAMURI BALAKRISHNA) అన్నారు. చంద్రబాబు అరెస్ట్(ARREST), జైలు(JAIL)కు తరలించడం వంటి పరిణామాలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్కు తరలించడాన్ని కొందరు తట్టుకోలేక పోయారని దాంతో గుండెపోటుతో(HEART ATTACK) మరణించడం, మరికొందరు వీరాభిమానులు సుసైడ్(SUICIDE) చేసుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి విషాద ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని బాలయ్య బాబు అన్నారు. త్వరలోనే ప్రతీ కుటుంబాన్ని తాను కలవబోతున్నట్లు ఈ సందర్భంగా నేనున్నాను.. మీ వద్దకు వస్తాను అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
ఇక, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారా? అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇక ప్రజల్లోకి వెళ్లాలని బాలయ్య బాబు నిర్ణయించుకున్నారు.. ఇందుకోసం ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన తీరును తట్టుకోలేక కొందరు మరణించగా.. మరికొందరు అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.