శ్రీరాముని జన్మభూమి ఆయన అయోధ్యలో శ్రీరామాలయ నిర్మాణం ప్రతిఒక్క భారతీయుడి కళ. మన సంస్కృతికి, మన ధైర్యానికి, గర్వానికి భారత జాతి ఒన్నత్యానికి శ్రీరాముడు ప్రతీక. ధర్మనికి రాశీభూతమైన శ్రీరాముడిని తలుచుకోకుండా హిందువులకి ఒక్క రోజైన గడవదు. అలంటి ఇప్పుడు ఏకంగా జాతి గర్వించే విధంగా శ్రీరాముడి ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకుంటున్నాం. 2024 జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉన్న నేపథ్యంలో ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరథమహారథుల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో వారితో పాటు సాధారణ భక్తులకూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల బస, అన్నపానీయాలకు సంబంధించిన ఏర్పాట్లపై రామ జన్మభూమి ట్రస్ట్.. జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. అందులో భాగంగా దాదాపు 25 వేల మంది భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయోధ్య రాయాలయ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వారు ఆయోధ్య వాసుల ఇళ్లలో, హోటళ్లలో పెయింగ్ గెస్ట్‌గా బస చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ధర్మశాలలు, ప్రైవేటు హోటళ్ల సామర్థ్యానికి మించి భక్తులు వస్తారని అంచనా. అలాంటి వారికి సహాయం చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది. అయోధ్యలోని కరసేవక్‌పురం కాంప్లెక్స్, రామసేవక్పురం కాంప్లెక్స్ సహా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో టెంట్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ విషయంపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడారు.
‘టెంపుల్ సిటీ ద్వారా దాదాపు 25 వేల మందికి బస ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి జిల్లా అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయంతో భక్తులకు ఆహార పదార్థాలు అందించడం, మురుగునీటి శుద్ధి, విద్యుత్ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకు అవసరమయ్యే ఖర్చును ట్రస్ట్ భరిస్తుంది. ఇక, ఆహార పదార్థాలను జిల్లా పౌర సరఫరా విభాగం సరఫరా చేస్తుంది. అయితే, వీటన్నింటి కోసం భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు’ – చంతప్ రాయ్