ఉత్తర్‌ప్రదేశ్(UTTARPRADESH)లోని అయోధ్య(AYODHYA) శ్రీ రామ మందిరాన్ని(SRI RAM MANDIR) వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి(SRI RAM JANMABHUMI COMPLEX) కాంప్లెక్స్‌లో జరగనున్న ‘రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి మొత్తం నాలుగు వేల మంది(4000 MEMBERS) సాధువులు, మత పెద్దలను ఆహ్వానిస్తున్నారు(INVITED). అంతేకాకుండా వివిధ కళా రంగాలకు చెందిన ప్రముఖ నటీనటులు(CELBRITIES), సాహితివేత్తలు, కవులు, రచయితలతో పాటు పద్మా అవార్డు(AWARD) గ్రహీతలు, ఉన్నత హోదాల నుంచి రిటైర్డ్(RETIRED) అయిన అధికారులు(OFFICERS), పారిశ్రామికవేత్తలు(INDUSTRALISTS), ప్రముఖ న్యాయవాదులు(LAWYERS), న్యాయమూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్(CHAMPATH ROY) వెల్లడించారు.
ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు పాలు పంచుకునేలా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన తెలిపారు. మొత్తంగా 4000 మంది సాధువులతో పాటు 2000మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు చంపత్ రాయ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ‘రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవానికి 4000 మంది మత పెద్దలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన 2000 మంది వ్యక్తులను కూడా ఆహ్వానిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.