Public Relations Council of India Excellence Awards 2023 : తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Public Relations Council of India) ఎక్సలెన్స్ అవార్డులను 5 విభాగాలలో గెలుచుకుంది. న్యూదిల్లీలో 2023 సెప్టెంబర్ 21, 22 తేదీల్లో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్(17th Global Communication Conclave)లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్(Social Media Person of the Year) అవార్డును అందుకున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందజేస్తుంది. ఈ అవార్డుతో పాటు, డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికి గాను మరో నాలుగు పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డులను(PRCI Excellence Awards) గెలుచుకుంది. సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (Telangana IT Department Annual Report 2022-23), ప్రజా సేవల ప్రకటనల అవార్డు (మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం), ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం వీడియోస్కు అవార్టు లభించింది.
తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరఫున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు. ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం జూన్, 2014లో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారంతో పాటు సేవలను డిజిటల్ మధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యతగా వ్వవహరిస్తుంది. సామాజిక మాధ్యమాల ఖాతాల సృష్టి, వెబ్‌సైట్‌లు/పోర్టల్‌ల రూపకల్పన నిర్వహణకు సంబంధించిన పనులను చేపడుతోంది. అభివృద్ధి, నిర్వహణ, ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్ స్థానికీకరణ, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ(Telangana Digital Repository) కార్యక్రమాల అమలు డిజిటల్ మీడియా విభాగం(Telangana Digital Media Department) ఇతర ప్రధాన విధులు సాంకేతిక సంస్థల నిపుణులచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.