ఎటిఎం అంటే డబ్బులను బ్యాంకు అవసరం లేకుండా డ్రా చేసుకునేందుకు జారీ చేసిన కార్డు.. అయితే ఈ ఏటీఎం మెషిన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక ఇతర పనులను చేస్తుందని మీరెప్పుడైన గమనించారా?.. ఏటీఎం మెషిన్ నేటి రోజుల్లో ఎంతగానో ఉపయోకరంగా ఉంది. మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక పనులను సులభతరం చేసే ఇలాంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిలో మీరు దాదాపు ప్రతి బ్యాంకు ఏటీఎంమెషీన్ తో కొన్ని పనులను కూడా చెయ్యొచ్చునని నిపుణులు అంటున్నారు అవేంటో ఒక్కసారి చూద్దాం..
బ్యాంకుల ఏటీఎం మెషీన్‌లలో ఒక డెబిట్ కార్డ్ నుంచి మరొక డెబిట్ కార్డ్‌కి నేరుగా డబ్బును బదిలీ చేసే సదుపాయాన్ని పొందుతారు. ఈ విధంగా, ఈ ‘కార్డ్ నుంచి కార్డ్’ బదిలీ సహాయంతో, బ్యాంకు శాఖకు వెళ్లకుండానే ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును పంపవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంలలో ఇటువంటి బదిలీల పరిమితి రూ.40 వేల వరకు ఉంటుంది. మీ ఏటీఎంకార్డ్ పాస్‌వర్డ్‌ను ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఏటీఎం కు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మీరు ఈ పనిని కూడా ఇక్కడ సులువుగా చేసుకోవచ్చు..
కార్డు నుంచి కాకుండా మీరు ఏటీఎం నుంచి నేరుగా డబ్బులను బదిలీ చెయ్యొచ్చు..దీని కోసం మీరు డబ్బు, పొదుపు లేదా కరెంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా నంబర్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. చెక్ బుక్ ముగిసింది. బ్యాంక్ శాఖను సందర్శించడానికి మీకు సమయం లేదు. ఏటీఎం మెషీన్‌లో ‘చెక్ బుక్ రిక్వెస్ట్’ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ సమస్య తీరుతుంది.. కరెంటు బిల్లు ఉండి, మీరు ఏటీఎం నగదును విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లినట్లయితే, ఏటీఎం మెషీన్‌లోనే చెల్లించవచ్చు. దేశంలోని చాలా రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు బ్యాంకుల ఏటీఎం మెషీన్లలో తమ జాబితాను నమోదు చేసుకున్నాయి.. క్రెడిట్ కార్డు బిల్లులను కూడా ఏటీఎం ల ద్వారా చెల్లించుకోవచ్చు.