ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే వారు విడిపోయారు. ఈ విషయం జరిగిన తరువాత చాలామంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. ఇక హీరోయిన్లు జాతకంలో దోషాలు ఉన్నవారిచేత యాగాలు చేయించి దోష నివారణ చేయిస్తున్నాడు. ఇప్పటికే రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరొయిన్స్ చేత పూజ చేయించిన వేణుస్వామి ఈ మధ్యనే డింపుల్ హయతితో పూజ చేయించాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వేణుస్వామి.. ఒక ఏడాది క్రితం అల్లు అర్జున్ జాతకం చెప్పాడు. నిన్నటికి నిన్న బన్నీకి నేషనల్ అవార్డ్ రావడంతో.. ఏడాది క్రితం వేణుస్వామి చెప్పిన జాతకం నిజమే అని అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ గురించి వేణుస్వామి ఏమన్నాడంటే.. ” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్.. అల్లు అర్జున్ మాత్రమే. ఒక్కో సినిమాకు ఆయన 100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళుమూసుకుంటే 300 కోట్లు వచ్చేస్తాయి. నిర్మాతల గుండె ఆగిపోవడాలు, స్టంట్ వేయడాలు ఇలాంటి టెన్షన్స్ ఏం ఉండవు. అల్లు అర్జున్ కు రిస్క్ లేదు.. నిర్మాతలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ జాతకం .. సూపర్ స్టార్ జాతకం. ఇంకో పదేళ్లు తిరుగులేదు.. ఆయన ఈ పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన ఏ సినిమా తీసినా కూడా మినిమమ్ 200 కోట్లు వసూలు అవుతాయి. అల్లు అర్జున్ కు తిరుగు లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ లెక్కన.. మరో పదేళ్లు పుష్పగాడి రూలే నడుస్తుంది అని అభిమానులు కాలర్ ఎత్తి చెప్పుకొస్తున్నారు.