రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటో షేర్ చేసి దానికి ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించాడు. ఒక అమ్మాయి చేతిలో విజయ్ చేయి ఉంచి దాన్ని షేర్ చేసి చాలా జరుగుతున్నాయి, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఉండిపోతుంది, త్వరలోనే అనౌన్స్ చేస్తున్నాను అని అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. అయితే విజయ్ దేవరకొండ ఉద్దేశం ఏమిటో పూర్తిగా క్లారిటీ రావడం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలా పర్సనల్ విషయాలు కూడా ప్రమోషన్లకు వాడేస్తున్నారు.
కాబట్టి విజయ్ దేవరకొండ తన ప్రియురాలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడా? లేక పెళ్లి పీటలు ఎక్కి ఎందుకు సిద్ధమవుతూ ఆ విషయాన్ని ఇండైరెక్టుగా హింట్ ఇస్తున్నాడా? లేక తన సినిమాలకు లేదా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్ ఏదైనా ఇవ్వబోతున్నాడా? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గీత గోవిందం సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతూనే వస్తోంది. వీరిద్దరూ ఈ విషయాన్ని పలుసార్లు ఖండించినా సరే ఈ ప్రచారానికి మాత్రం బ్రేకులు పడడం లేదు. దానికి తోడు విజయ్ దేవరకొండ వెకేషన్ కి వెళ్లిన సమయంలో రష్మిక కూడా వెళుతూ ఉండడం ఎయిర్ పోర్ట్ లో ఒకే సమయానికి కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరి రిలేషన్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే విజయ్ అనౌన్స్మెంట్ దేని గురించి అనే విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జోరుగా సాగుతున్నాయి.