ఇటీవల కాలంలో క్షణం తీరికలేని జీవనంతో పెద్దవారితో సహా యువత అలసట నీరసానికి గురవుతున్నారు. పోషకాహార లోపం, నిద్రలేమి, రక్త హీనత ఇలా రకరకాల కారణాల వల్ల అలసట, నీరసం వంటి సమస్యలకు గురవుతుంటారు. ఆ సమయంలో శరీరంలో శక్తి మొత్తం కోల్పోయినట్టు అనిపిస్తుంది.చిరాకు, కోపం ఎక్కువగా వస్తాయి. యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పనిని ఉత్సాహంగా చేయలేరు. అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే క్షణాల్లోనే అలసట, నీరసం సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో నిమ్మరసం, చిటికెడు ఉప్పు మరియు ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల అలసట, నీరసం సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే అరటి పండు కూడా అలసట, నీరసం సమస్యలను సులువుగా దూరం చేస్తుంది. అరటి పండులో పుష్కలంగా ఉండే పొటాషియం, ఫైబర్, విటమిన్ బి మరియు విటమిన్ సిలు శక్తిని పెంచుతాయి.అందవల్ల, నీరసంగా లేదా అలసటగా ఉన్న సమయంలో అరటి పండు తింటే సూపర్ ఎనర్జిటిక్‌గా మారతారు.
నిద్ర సరిగ్గా లేకపోయినా అలసట, నీరసం సమస్యలకు గరవుతారు. కాబట్టి, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్లు, ల్యాప్‌టాప్స్ పక్కన పెట్టేసి హాయిగా నిద్ర పోవాలి. అలాగే శరీరానికి కావాల్సినన్ని నీళ్లు అందకపోయినా అలసట, నీరసం సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఖచ్చితంగా ప్రతి రోజు నాలుగు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఇక డైలీ డైట్‌లో ఖచ్చితంగా నట్స్ చేర్చుకోవాలి. అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు.శారీరక శక్తి మరియు మానసిక శక్తిని పెంచి అలసట, నీరసం సమస్యలను దూరం చేస్తుంది.అలాగే పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్ గా చెబుతారు. కాబట్టి, నీరసం, అలసటగా ఉన్నప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.