Friday, December 20, 2024
Home టెక్నాలజీ Iphone – 14: యాపిల్ చరిత్రలో తొలిసారి.. సరికొత్తగా యాపిల్ 14..

Iphone – 14: యాపిల్ చరిత్రలో తొలిసారి.. సరికొత్తగా యాపిల్ 14..

by స్వేచ్ఛ
0 comment 101 views
iphone -14 relaunch

యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను కొత్త ఫీచర్‌తో తిరిగి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో ఐఫోన్ 14 సిరీస్ మళ్లీ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే యాపిల్ మొదటిసారి కొత్త ఫీచర్‌తో రీలాంచ్ చేసిన ఫోన్ ఇదే అవుతుంది.

ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ రెండో వారంలో మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఐఫోన్ 14 లైనప్ మార్కెట్లో నడుస్తుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యాక ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్‌లో టైప్-సీ పోర్టును అందించి, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్స్‌ను డిస్‌కనెక్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.


2024 తర్వాత యూరోప్‌లో విక్రయించే డివైసెస్‌లో కచ్చితంగా యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టు ఉండాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 14 సిరీస్‌ను కంపెనీ 2024 నుంచి యూరోప్‌లో విక్రయించలేదన్న మాట. అందుకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతోనే లాంచ్ కానున్నాయి.

యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. వాటికి సంబంధించిన ధరల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం ఐఫోన్ 15 ధరలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ స్టాండర్డ్ మోడల్ ధర 799 డాలర్లుగా ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా ఇండియాలో ఇదే ధరతో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 ప్లస్ ధరను కూడా యాపిల్ పెంచుతుందని వార్తలేమీ రాలేదు. ఈ ఫోన్ 899 డాలర్లతో అమెరికాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అంటే భారతదేశంలో రూ.89,900 ధరతో ఎంట్రీ ఇవ్వవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ కూడా ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయిందన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఇక ఐఫోన్ 15 ప్రో ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్రో లాంచ్ అయినప్పుడు అమెరికాలో దాని ధర 999 డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో 1,099 డాలర్ల ధరతో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మనదేశంలో 2022లో రూ.1,29,900 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు అమెరికాలో 100 డాలర్లు పెంచుతున్నారు కాబట్టి మనదేశంలో రూ.1,39,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రారంభ స్టోరేజ్ మోడల్ అయిన 128 జీబీ వేరియంట్ ధర. స్టోరేజ్ పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతూనే పోతుంది.

గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1,099 అమెరికాలో డాలర్ల ధరతో లాంచ్ అయింది. కానీ ఈసారి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఏకంగా 1,299 డాలర్ల ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అంటే డాలర్లలో చూసుకుంటే 200 డాలర్ల పెంపు ఉండనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయినప్పుడు దాని ధర మనదేశంలో రూ.1,39,900గా నిర్ణయించారు. దీన్ని బట్టి ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ఏకంగా రూ.20 వేల పెంపుతో రూ.1,59,900 ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే టాప్ ఎండ్ 1 టీబీ వేరియంట్ ధర రూ.2 లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News