దేశంలోనే మహిళా సాధికారత(Women Empowerment)లో ఏపీ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్(Minister KV Ushasree Charan) వ్యాఖ్యానించారు. శిశు, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలన్నింటిలోనూ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేయిస్తున్నారని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మహిళా సాధికారతపై(State Govt)చేపట్టిన చర్యలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె సమాధానమిచ్చారు. సంపూర్ణ పోషణ్, అమ్మ ఒడి, కల్యాణమస్తు, షాదీ తోఫా, చేయూత, ఆసరా, వృద్ధాప్య పెన్షన్లు తదితర పథకాలను అమలు చేయిస్తూ మహిళా సాధికారతను సీఎం జగన్ సాకా రం చేశారని కొనియాడారు. ఈ నాలుగేళ్లలో మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,53,862 కోట్లను వెచి్చంచిందన్నారు. జగనన్న అమ్మ ఒడి(Mom’s lap) కింద 44 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను మూసివేయిస్తే.. సీఎం జగన్ వాటన్నింటినీ తెరిపించడమేగాక, బాలికల కోసం ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో బాలికలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఇప్పుడు నాడు–నేడు(Nadu-Nedu) కింద ప్రతి స్కూల్లో వారికోసం ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించామన్నారు. విద్యాదీవెన(Vidhyadheevena), వసతి దీవెన కింద కోట్లాది రూపాయలు అందిస్తూ.. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. పేద పిల్లలకు పూర్తి రీయింబర్స్‌మెంట్ అందించడంతో పాటు వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అదే చంద్రబాబు.. విద్యార్థులకు నైపుణ్యం పేరిట ఇవ్వాల్సిన నిధుల్లో కుంభకోణం చేసి వాటిని స్వాహా చేశారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేయగా.. వైఎస్ జగన్.. డ్వాక్రా రుణమాఫీని నాలుగు దశల్లో చేసేలా నిధులు విడుదల చేయిస్తున్నారని తెలిపారు.
బ్యాంకులు, అమూల్ వంటి పరిశ్రమలు, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేయిస్తూ మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారని, సున్నా వడ్డీకి బాబు స్వస్తి పలికితే.. సీఎం జగన్ దానిని అమలు చేయడమే కాకుండా అధిక నిధులిస్తున్నారని మంత్రి వివరించారు. దా దాపు 30.76 లక్షల మంది మహిళల పేరిట ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, జగనన్న శాశ్వ త భూ హక్కు ద్వారా మహిళలకు భూ హ క్కులు కలి్పంచామన్నారు. దిశ చట్టంతో పాటు, ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేశామని మంత్రి ఉషా శ్రీచరణ్ వివరించారు.