ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings)సజావుగా జరిగాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈరోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలపై చర్చజరిగింది. అలాగే.. చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన(vidhyadeevena), వసతి దీవెన అంశాల పై ప్రశ్నలను చర్చించారు . సభలో 9 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్ -2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్-2023, ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్(AP Private Universities Amendment)తో పాటు సభలో ఒక తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ కులాల జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రానికి విఙప్తి చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలు జరిగాయి.
4 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్ సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు 2023, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు 2023, ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు-2023ను ఆమోదించింది. అసెంబ్లీ లో మంత్రి ధర్మాన మాట్లాడుతూ…ప్రభుత్వ సంస్కరణలను అంతా అభినందించాలి.అందుకే ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలనేదే సీఎం జగన్ సంకల్పం. రైతుపై ఒక్క రూపాయి భారం లేకుండానే సర్వే చేశాం. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది. మరో రూ. 500 కోట్లు ఖర్చు పెడతాం.
4వేల గ్రామాల్లో సర్వే పూర్తయింది. భూసర్వేకు 10వేల మంది సిబ్బందిని నియమించాం. సర్వే కోసం ఇప్పటిదాకా రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాం. సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. భూసర్వే ఓట్ల కోసం చేసింది కాదు.. భవిష్యుత్తు తరాల కోసం చేసింది.’ అని అన్నారు.