ఆంధ్ర ప్రదేష్ లోని విశాఖపట్నంలో ఓ లాడ్జిలో మెడికో అనుమానాస్పద మృతి చెందినవిషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసుకొని విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడీ కేసు కీలక మలుపు తిరిగింది. కేరళకు చెందిన ఎంఎంబీఎస్ విద్యార్థిని రమేష్ కృష్ణ విశాఖలో ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోటు కూడా రాసింది. ఇక, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్టు చెబుతున్నారు.. ప్రియుడుతో ఏర్పడ్డ మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు.. కాగా, ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన మెడికో రమేష్ కృష్ణ(25). అంతకు ముందే ఇండోర్ లో ఉన్న ప్రియుడుని కలిసి వచ్చినట్టు తెలుస్తోంది..
అయితే, చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది రమేష్ కృష్ణ.. ఆమె స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం.. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ.. విశాఖపట్నం నుండి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్ నేపథ్యంలో.. విశాఖలోని దాబా గార్డెన్ లోని ఓ లాడ్జిలో దిగింది.. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది.. లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతున్నట్టు యువతి మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం రావడంతో.. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో మలయాళం భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. “జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ” సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది యువతి.. మొత్తంగా ఇప్పుడు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు గల కారణంగా చెబుతున్నారు విశాఖ పోలీసులు.