తిరుమల(TIRUMALA)లో చిరుతల(LEOPARD) సంచారం శ్రీవారి భక్తుల(DEVOTEES)ను కలవరానికి గురిచేస్తోంది. అలిపిరి(ALIPIRI)- తిరుమల నడక మార్గం ఏడోమైలు వద్ద నరసింహస్వామి(NARSIMHASWAMY) ఆలయ సమీపంలోని అటవీప్రాంతంలో మరో చిరుత రెండు రోజులుగా సంచరించడాన్ని ట్రాప్ కెమెరా(TRAP CAMERAS)లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(LAKSHITHA) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది.
ఈ చిరుతను కూడా పట్టుకునేందకు అటవీశాఖ(FOREST DEPARTMENT) అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. జూన్‌లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఆస్పత్రిలో కోలుకున్నాడు.. కొద్ది రోజులకే ఓ చిరుత దొరికింది. ఆ తర్వాత ఆగస్టు 11న నెల్లూరు(NELLORE) జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత లాక్కెళ్లి చంపిన ఘటన కలకలంరేపింది. ఆ వెంటనే టీటీడీ(TTD) అధికారులు, అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు. ఇక వాటి బెడద తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ట్రాప్ కెమెరాలోను ఆ ప్రాంతాల్లోనే ఉంచారు. తాజాగా మరో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు..