అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా మారిపోయింది. అందులోకి మొత్తం ఊరు మొత్తం చనిపోయి..వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ భరించడం అంత ఇంత కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఎందువల్ల జనాలు పిట్టలా రాలిపోయారనేది ఇప్పటికి అంతుతేలని మిస్టరీలా ఉండిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్. వారంతా అదే తమకు చివరి రాత్రి అని అస్సలు ఊహించలేదు. ఏమైందో ఏమో హఠాత్తుగా పశువులు, జంతువులు మనుషులు ఎక్కడివాళ్లు అక్కడే విగతజీవుల్లా మారిపోయారు. ఎందుకు అంతా అలా చనిపోతున్నారు, ఏం జరుగుతుందని తేరుకునేలోపు అంతా అయిపోయింది.
వేళ్లపై లెక్కపెట్టేంత మందే బతికారు. ఆయా వ్యక్తులు తమ వాళ్లంతా చనిపోతే ఆ శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఆ గ్రామం అంతా అత్యంత నిశబ్దంలోకి వెళ్లిపోయింది. ఆ అనూహ్య ఘటనతో ఓ మహిళ ఏడుస్తూ పిచ్చి పట్టినట్లుగా బట్టలు చింపుకుని వింతగా ప్రవర్తించింది. హలీమా అనే మహిళ, కొందరూ వ్యక్తులు తప్ప అంత నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. అంతమంది ఒకేసారి చనిపోయిన ఎవ్వరిపై ఒక్క ఈగ కూడా వాల్లేదు.
ఇది అత్యంత ఆసక్తి రేపే కీలక అంశం. కనీసం కీటకాలు గానీ ఏవిలేవు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అందరూ ఒక్కొక్కరిగా చనిపోయినట్లు నాటి భయనక ఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ వ్యక్తులు. ఈ ఘటన 1986లో జరిగింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. మొత్తం గ్రామమే తుడిచిపెట్టుకుపోవడం అక్కడ ఓ వింత ఘటనగా చర్చనీయాంశంగా మారిపోయింది. నాటి ఘటనలో దాదాపు 1,746 మంది దాక చనిపోగా సుమారు 3,500 వ్యవసాయ జంతువులు చనిపోయినట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆ గ్రామం సమీపంలో న్యాస్ అనే సరస్సు ఉందని, దానిలోంచి కార్బన్ డయాక్సైడ్ ఫ్రీక్ ఫ్లూమ్ పెరగడంతోనే అందరూ మరణించినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.
మొత్తం 1.6 మిలియనల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని, సరిగ్గా లోయకు సమీపంలోని వ్యక్తులంతా పీల్చడంతోనే చనిపోయారని అన్నారు. ఐతే ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చినట్లు చెప్పారు. మరికొంత మంది ఈ ఘటన తరువాత రోజు ఒక్కొక్కరుగా చనిపోయారు కూడా. అలాగే ఆ న్యాస్ నది జలాలు కూడా ఆ రోజు నీలిరంగుకు బదులు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇలాంటి భయానక ఘటనలు యూఎస్‌లో చాలా జరిగాయి కూడా. ఐతే శాస్త్రవేత్తలు వీటిని అంతుపట్టని సహజ మరణాలుగా తేల్చారు. వాస్తవికంగా ఏం జరింగిందనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలా ఉండిపోయాయి. పలువురు శాస్త్రవేత్తలు ఆ సరస్సు వల్ల అని, విషవాయువుల వల్ల అని రకరకాలుగా చెప్పారే తప్ప ఏం జరిగిందనేది? ఎవ్వరూ నిర్థారించలేకపోయారు.