సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులు, ఆ నెగిటివిటీ చూసి తాను అసలు ఫీలవ్వడం లేదని అనసూయ భరద్వాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. అది చూస్తే… ఆమె వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఉన్నాయి. దాంతో పాటు ఓ భారీ లేఖ కూడా రాశారు. ట్రోల్స్, నెగిటివిటీ ప్రభావం చూపిస్తున్నాయనే భావన ఆ మాటల్లో వ్యక్తం అయ్యింది. కొన్ని క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే… తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతూ అనసూయ మరో వీడియో విడుదల చేశారు.
”సోషల్ మీడియా నెగిటివిటీకి అసలు ఫీల్ అవ్వడం లేదు. నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు. కోపంతో ఉంటుంది” అని అనసూయ చాలా స్పష్టంగా చెప్పారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో తాను ఆ విధంగా ఎమోషనల్ అయ్యాయని తెలిపారు. ఏంటి.. మీరు చదవలేదా? అని నెటిజనులు అనసూయ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. తాను చెప్పిన విషయాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారని, కొందరు మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
అసలు విషయం ఏంటంటే.. ఒకవేళ తాను సరిగా చెప్పకపోతే అరకొర మంది కూడా సరిగా అర్థం చేసుకునే వాళ్ళు కాదని అనసూయ వ్యాఖ్యానించారు. ”నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే… మనం సంతోషంగా ఉన్న సందర్భాలను మాత్రమే అందరికీ చూపించాలని అనుకుంటాం. నాకు ఏడుపు వచ్చిన సందర్భాల్లో సందేహం వచ్చేది. నేను పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇంట్లో అయినా, బయట అయినా నేను ఎలా ఉండాలనే విషయంలో చాలా మంది ఓ అభిప్రాయంలో ఉంటారు. ఏడవడం తప్పు కాదని ఆ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా” అని అనసూయ పేర్కొన్నారు.
ప్రజలు తనపై సానుభూతి చూపడం తనకు నచ్చదని అనసూయ వివరించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ”సోషల్ మీడియా నెగిటివిటీ నాపై ప్రభావం చూపించదని నేను చెప్పను. అయితే, సానుభూతి పొందాలనుకోను. ట్రోలింగ్ వల్ల ఏడవలేదు. నేను అంత వీక్ కాదు. అది అర్థం చేసుకోండి” అని చెప్పారు. సోషల్ మీడియా ట్రోలింగ్, నెగిటివిటీకి సంబంధం లేనప్పుడు.. సామాజిక మాధ్యమాలను ప్రజల ముందుకు తీసుకు రావడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు అలా ఉందా? అని అనసూయ ప్రశ్నలు సంధించడం ఎందుకని కొందరు నెటిజనులు కొత్త వీడియో చూసి ప్రశ్నలు వేస్తున్నారు. చాలా మంది ఆమెపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో పోస్ట్ చేశాక.. తాను సెలూన్‌కి వెళ్లి వచ్చినట్లు స్టార్ యాంకర్, యాక్ట్రెస్ అనసూయ పేర్కొన్నారు. ఆదివారం కూడా తనకు పని ఉందని చెప్పుకొచ్చారు. అంటే.. సండే షూటింగ్ ఉందన్నమాట. ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటు కొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆమె టీవీ షోలు చేయడం లేదు. ఆ సంగతి తెలిసిందే.