చాలమంది జంతు ప్రేమికులు అడవిని చూడాలని.. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను, పక్షులను దగ్గరగా వీక్షించాలని ఉంటుంది. వీలయితే కెమెరాలతో.. అదీ కుదరకపోతే తమ కళ్లతోనే ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను బంధించాలని అనుకుంటారు. అలంటి సుందరీకరమైన ఫారెస్ట్ తెలంగాణలోని అమ్రాబాద్ అడవి. ఈ అమ్రాబాద్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవగానే ప్రకృతి రమణీయతతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా దట్టమైన చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. జంతువుల సందడి కనిపిస్తూ ఉంటాయి. అయితే దేశంలోనే అత్యధిక పులులు ఉన్న రెండో అతిపెద్ద అడవిగా తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ నిలిచింది. ఇక్కడ ప్రస్తుతం 18 ఆడ పులులు, 12 మగ పులులు మొత్తం 30 పెద్దపులులతో పాటు 3 పిల్ల పులులు కూడా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులులతో పాటు చిరుతలు, చుక్కల దుప్పులు, నెమళ్లు, కణతి, మనుబోతులు, అడవి పిల్లులు, అడవి కుక్కలు, అడవి కోడి, ఎలుగుబంటు, మూషిక జింకలు, కోతులతో పాటు అడవి బర్రెలు ఉన్నాయి. ఈ అడవి నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజక వర్గంలో ఉంది.
ఇండియాలోనే అతి పెద్ద రెండవ ఫారెస్ట్ ఇది.ఇది 2611 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ లో ఎక్కువ సంఖ్యలో పులులకు నెలవైన ప్రదేశంగా అమ్రాబాద్ గురించే మాట్లాడతారు. గతంతో పోల్చుకుంటే పులుల సంఖ్య పెరిగింది. 2019 సంవత్సరంలో 12గా ఉన్న పులుల సంఖ్య .. తాజా రిపోర్టులో 32కి పైగా చేరింది. దాదాపు 50కి పైగా వన్యప్రాణులు అటవీ అధికారులు గుర్తించారు. అంతేకాదు మచ్చల జింకలు, సాంబార్, నీలగై, నాలుగు కొమ్ముల జింక, చింకారా వంటి అటవీ జంతువులు ఈ ఫారెస్ట్‌కు స్పెషల్ అట్రాక్షన్ అంటారు. వీటితో పాటు మల్టీ కలర్ పుట్టెలు,యూరప్ నుంచి వచ్చిన రేర్ బర్డ్స్ కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ అనేక జాతుల వృక్ష, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉందనే పేరుంది.
అటవీ అందాలు చూడటానికి వెళ్లే వారికి అటవీ శాఖ ప్రత్యేకంగా సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమ్రాబాద్ వెళ్లగానే ప్యాకేజీలో భాగంగా ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మన్ననూర్ సీబీఏటీ చేరుకోవాలి. ఆర్డర్ ప్రాతిపదికన ఇక్కడి చింకారా హాల్‌లో లంఛ్ చేయొచ్చు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి ఎగ్జిబిషన్, షార్ట్ మూవీ ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య జంగిల్ సఫారీ ఉంటుంది. ఇందుకోసం 4 గంటలకు రిసెప్షన్ వద్ద రిపోర్ట్ చేయాలి. 8 గంటల వరకు చింకారా హాల్‌కు తిరిగి వస్తారు. 8 గంటలకు రాత్రి భోజనం చేస్తారు. 9 గంటలకు రాత్రి బస చేస్తారు. అక్కడ లోకల్‌గా ఉండేవారే టూరిస్ట్ గైడ్స్‌గా కనిపిస్తూ ఉంటారు. ఈ అడవి గురించి అందులోని జంతువులు, పక్షులు గురించి టూరిస్ట్ గైడ్స్ పర్యాటకులకు వివరంగా వివరిస్తారు.