అమెరికాలోని హవాయి దీవుల్లో ఒకటైన మౌయి దీవిలో ఉన్న లహైనా పట్టణంలో గత మంగళవారం మొదలైన కార్చిచ్చు.. ఇంకా బీభత్సం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ ప్రకృతి విపత్తు 67 మందిని బలి తీసుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యటక నగరం బూడిద దిబ్బగా మారింది. సుదూరంలో ఏర్పడిన హరికేన్ ప్రభావంతో 5 రోజుల క్రితం మొదలైన ఈ కార్చిచ్చు అనుకోని విషాదాన్ని నింపింది. ఇళ్లు, భవనాలు, జంతువులు, భారీ వృక్షాలు సర్వం దగ్ధమై ఆ ప్రదేశమంతా శ్మశానాన్ని తలపిస్తోంది. సహాయక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కార్చిచ్చు ధాటికి వేలాది నివాసాలు, భవనాలు కాలి బూడిదయ్యాయి. రోడ్లపై వందలాది వాహనాలు జరిగిన విధ్వంసానికి మౌన సాక్ష్యంగా నిలిచాయి.
కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలకు.. అమెరికా సైన్యం, వాయుసేన సాయం అందిస్తున్నాయి. హెలికాప్టర్లు, ఫైర్ విమానాల ద్వారా నీటిని మంటలపై కుమ్మరిస్తున్నారు. ఆ సమయంలో హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎలాంటి హెచ్చరిక సైరన్లు మోగించలేదని తెలుస్తోంది. హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలో ఉన్న లహైనా పట్టణంలో గత మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు బీభత్సం కొనసాగుతూనే ఉంది.శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యటక నగరం బూడిద దిబ్బగా మారింది. ఇప్పటి వరకు ఈ దావానలం పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసింది.సుదూరంలో ఏర్పడిన హరికేన్ ప్రభావంతో 5 రోజుల క్రితం మొదలైన ఈ కార్చిచ్చు అనుకోని విషాదాన్ని నింపింది. విపరీతమైన ఈదురుగాలుల కారణంగా మంటలన్నీ పట్టణమంతా విస్తరించాయి.ఇళ్లు, భవనాలు, జంతువులు, భారీ వృక్షాలు సర్వం దగ్ధమై ఆ ప్రదేశమంతా శ్మశానాన్ని తలపిస్తోంది. అనుకోకుండా మంటలు చుట్టుముట్టడం వల్ల ప్రాణభయంతో స్థానికులంతా పరుగులు పెట్టారు. కార్చిచ్చు ధాటికి వేలాది నివాసాలు, భవనాలు కాలిబూడిదయ్యాయి. రోడ్లపై వందలాది వాహనాలు జరిగిన విధ్వంసానికి మౌన సాక్ష్యంగా నిలిచాయి.