ప్రపంచ కుబేరులు, బడా వ్యాపారవేత్తలు తమకు ప్రశాంతంగా ఉండాలని.. సౌకర్యవంతంగా ఉండేలాగా ఎస్టేట్స్ ను, లగ్జరీ విల్లాలను, ద్వీపాలను కొనుగోలు చేస్తుంటారు. అటువంటి వారిలో సాఫ్ట్ వేర్ సంస్థలకు చెందిన సీఈవోలు, సంస్థల యజమానులు, కోఫౌండర్లు ఎక్కువగా ఉంటారు. అలాగే వారితోపాటు ప్రపంచ కుబేరులు, బహుళజాతి సంస్థలకు చెందిన యజమానులు కూడా ఉంటున్నారు. ఇటువంటి వారు తమకు అన్నిరకాల సౌకర్యాలు ఉండేలాగా ఇళ్లను నిర్మింప చేసుకుంటారు.. లేదా అలా నిర్మితం అయి ఉన్న వాటిని కొనుగోలు చేస్తారు. అందుకోసం వారు వందల కోట్లతో అవసరం అయితే వేల కోట్లను సైతం వెచ్చించడానికి వెనుకాడరు. ఇపుడు అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. తాను రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు.
ప్రపంచంలోనే మూడో కుబేరుడైన అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ భారీ ఆస్తులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో ఉన్న ఎస్టేట్‌ను దాదాపు రూ.560 కోట్ల (68 మిలియన్ల డాలర్లు)తో కొనుగోలు చేసేందకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆ సంస్థ ప్రకటించిన రికార్డుల ప్రకారం ఆయన కోనుగోలు చేయబోయే ఎస్టేట్ దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంటుంది.
తన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో ఇటీవల సందడి చేసిన జెఫ్ బెజోస్ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ను జోడించడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8 ఎకరాల్లోని (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ MTM స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై కూడా జెఫ్ బెజోస్ దృష్టి పెట్టారని.. ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్ ఇండియన్ క్రీక్‌ను “బిలియనీర్ బంకర్” అని పిలుస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా తెలుస్తోందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. అక్కడ బెజోస్‌తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్‌తోపాటు మౌయ్‌లోని ఒక ఎస్టేట్‌తో సహా పలు లగ్జరీ భవనాలు జెఫ్ బైజోస్‌కు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఎస్టేట్ కొన్న ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ మాత్రమే ఉన్నాయి.