సాధారణంగా జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేది. దానిని ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అందుకే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతుంటారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం వంటివి చేయడానికి సమయం సరిపోవడం లేదు. చిన్న వయస్సులో శరీరం మనకు సహకరించడం మానేస్తుంది. కొన్ని సార్లు మనం పూర్తిగా మెడిసిన్ మీద ఆధారపడుతుంటాం. జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా నిజంగా తెలిస్తే ఆహారంలో కూడా దీనిని వేయకుండా వదిలిపెట్టరు. జీలకర్ర లో అనేక రకాల ఔషధ గుణాలు పోషక విలువలు ఉంటాయి వీటి ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు శరీరంలోకి రాకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా కడుపు నొప్పి తగ్గి నుంచి మొదలుపెడితే డయేరియా వరకు ప్రతిదానికి అద్భుతంగా పని చేస్తూ ఉంటుంది.
జీలకర్రను తీసుకోవడం ద్వారా జీర్ణాశయంలో గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా పుల్లని త్రేన్పులు తో బాధపడేవారు కొద్దిగా జీలకర్రను ఉప్పుతో కలిపి తీసుకుంటే వెంటనే తొలగిపోతాయి ఇదే కాదు నులి పురుగులు సమస్యలు ఇబ్బంది పడేవారు ప్రతిరోజు జీలకర్ర కొంచెం తీసుకొని నమలడం ద్వారా అవి చనిపోతాయి. అల్సర్లు కడుపులో పుండ్లు సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు ఉదయం ఒక టీస్పూన్ నెయ్యిలో ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే ఈ సమస్యలకి చెక్ పెట్టొచ్చు అదేవిధంగా ఆహారంలో జీలకర్ర ని చేర్చడం ద్వారా బీపీ తగ్గుతుంది అధిక బరువుతో బాధపడే వారు దీనిని తీసుకోవడం ద్వారా శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.
అరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జీలకర్ర. ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు మరియు ఎలర్జీ తో బాధపడేవారు జీలకర్ర కషాయాన్ని తాగడం ద్వారా వీటి బారి నుంచి బయటపడొచ్చు అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ షుగర్ లాంటి రోగాలు కంట్రోల్లో ఉంటాయి. విరోచనాలతో బాధపడుతున్న వారు జీలకర్రను 1 స్పూన్ కొత్తిమీర రసంతో ఉప్పుతో కలిపి తీసుకోవడం ద్వారా వెంటనే తగ్గుముఖం పడతాయి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జీలకర్ర ను తీసుకోవడం ద్వారా నిద్ర త్వరగా పడుతుంది. ఆకలి లేని సమస్యతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఉప్పు జిలకర్ర పొడి మరియు కొత్తిమీర రసం మూడింటిని కలిపి స్పూను తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది అదేవిధంగా కడుపులో ఎసిడిటీ లేకుండా చేస్తుంది వాటితో పాటు సుఖ విరోచనం అయ్యే విధంగా చేస్తుంది.