జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని స్టోరీస్‌లో సంథింగ్ స్పెషల్ బుధవారం ఉదయం 9 గంటలకు రాబోతోంది స్టే ట్యూన్డ్ అంటూ ఒక స్టోరీ అప్డేట్ చేశారు. అయితే అల్లు అర్జున్ కి సంబంధించి కొత్త సినిమా ప్రకటన లేదా మరేదైనా అయి ఉండవచ్చు అందరూ భావిస్తున్నారు. కానీ ఇది అంతకు మించి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు అల్లు అర్జున్ ను ఇటీవల ఇంస్టాగ్రామ్ అఫీషియల్ టీం కలిసి కొన్ని వీడియోలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఇన్‌స్టాగ్రామ్ ప్రమోట్ చేసేందుకు వాడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలాంటి ఒక షూట్ చేయడం ఇండియాలో ఇదే మొదటిసారి అని అంటున్నారు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అత్యధికంగా కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ ఇండియాలో 63వ స్థానం దక్కించుకున్నాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ లో 21.94 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనకంటే ముందు 62 మంది సెలబ్రిటీలు ఉన్నా అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ టీం ఎందుకు ఎంచుకుంది? అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప ది రైజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సాధించారు. ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ దశలో ఉండటంతో ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2024 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.