పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఒక వీడియోను అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు అప్ డేట్లకు సూపర్ రెస్పాన్స్ రాగా సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ లో గంగమ్మ జాతరలో ఉన్న వ్యక్తిగా కనిపించాడు బన్నీ. ఇక మొదటి భాగం కంటే పూర్తి భిన్నంగా ఈ పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు. ముందు భాగంలో పుష్పలో కూలీ నుండి సిండికేట్ వరకు ఎదిగిన విధానం చూపించగా రెండో భాగంలో ఆయన స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు సహాయం చేయడం చూపించారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో ఆల్ టైం రికార్డు కొట్టింది. అదేమంటే ఇంస్టాగ్రామ్ లో ఏడు మిలియన్ లైక్స్ సాధించి అత్యధిక లైక్స్ సాధించిన ఫస్ట్ లుక్ గా నిలిచింది. పుష్ప పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది, హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూట్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నారు. పుష్ప ది రూల్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో పలు ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా భాగం అవుతున్నారు.