కళామతల్లి ముద్దు బిడ్డ.. దశాబ్దాల పాటు సినీ ఇండ్రస్టీలో అలుపెరుగని నటనతో… చరితలో నిలిచిపోయే సినిమాలతో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెదిరిపోని నటనతో ఆకట్టుకున్న మహానుభావుడు అక్కినేని నాగేశ్వర రావు(Akkineni Nageswara Rao). నటనే ఆయన శ్వాస, ధ్యాస.. తెలుగు సినీ కళామతల్లి ఒడిలో ఆయనో అలుపెరగని బాటసారి… ఆయన నటనను వివరించడానికి అక్షరాలు చాలవు. సినీ రంగంలో సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన నట దిగ్గజం. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా నటించి నటనకే భాష్యం చెప్పిన నటసామ్రాట్(Nata Samrat)… ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వర్రావు. నేడు ఈ మహానటుడి శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏఎన్నార్ విగ్రహాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President of India Venkaiah Naidu) ఆవిష్కరించారు. అనంతరం నివాళులు అర్పించాహ్రూ. ఏఎన్నార్ తో తమకున్న అభిమానాన్ని ప్రతిఒక్కరు పంచుకుంటూ నివాళులు అర్పించారు.
ఇక తండ్రి గురించి మాట్లాడుతూ హీరో నాగార్జున(Hero Nagarjuna) ఎమోషనల్ అయ్యాడు. “నేను ఏ విగ్రహాం చూసినా.. ఆయన గొప్ప వ్యక్తి, ఇప్పుడు మనతో లేరు అనే భావన చిన్నప్పటి నుంచి నా మనసులో ముద్రపడిపోయింది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించేవరకూ చూడలేదు. ఎందుకంటే.. నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్న గారు మా గుండెలను నాన్న ప్రేమతో నింపారు.
చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి. సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా మధ్యలోనే నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన మన అందరి మనసుల్లో జీవించే వుంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు. ఎప్పుడు ఆహ్వానించినా ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని ఎమోషనల్ అయ్యాడు.