Monday, December 23, 2024
Home ట్రెండింగ్ DELHI: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మన దేశ రాజధాని..

DELHI: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మన దేశ రాజధాని..

by స్వేచ్ఛ
0 comment 68 views
DELHI IS THE MOST POLLUTED CITY IN WORLD

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది. ఒక్క పక్క దేశాలు గర్వించేలా భారత ప్రస్థానం ఉంటె మరోవైపు దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఎదురుకోవడం శోచనీయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వార్షిక సగటు కాలుష్య పరిమితి (5 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌) కంటే ఢిల్లీలో కాలుష్యం చాలా అధికంగా ఉన్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (ఏక్యూఎల్‌ఐ) స్పష్టం చేసింది. దేశంలోని 130 కోట్ల మంది అధిక కాలుష్య ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే.. ఢిల్లీ నగరంలో నివసించే పౌరుల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్.. ఢిల్లీ కాలుష్యంపై ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది.

ఇక ఆ న‌గ‌రంలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల ఆయుష్షు 12 ఏళ్లు త‌గ్గిపోనున్నట్లు స్ట‌డీ పేర్కొన్న‌ది. చికాగోలోని ఎన‌ర్జీ పాల‌సీ ఇన్స్‌టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌పై డేటాను రిలీజ్ చేసింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన స‌గ‌టు ఆరోగ్య స్థాయి క‌న్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్న‌ట్లు తెలిపారు. భారత దేశంలో 67.4 శాతం మంది ప్రజలు.. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి జీవిత కాలం 5.3 ఏళ్లు తగ్గిపోతున్నట్లు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఉన్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోబోతున్నారని పేర్కొంది.

ఢిల్లీ ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే సాంద్ర‌త మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని రిపోర్టులో తెలిపారు. వాహ‌నాలు, నిర్మాణాలు, వ్య‌వ‌సాయం వ‌ల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. కాలుష్య వాయువుల‌ను పీల్చ‌డం వ‌ల్ల బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్థాన్‌, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల ప్ర‌జ‌లు ఆరేళ్ల వ‌ర‌కు త‌మ జీవిత‌కాలాన్ని కోల్పోనున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాను అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించిన షికాగో వర్సిటీ నివేదిక.. అక్కడ కూడా కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ప్రమాణాల ( పీఎం 2.5) కంటే 7 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే తీవ్రమైన కాలుష్యం స్థాయిలు కొనసాగితే.. పఠాన్ కోట్ జిల్లా ప్రజల వయస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక అంచనావేసింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యానికి భౌగోళిక, వాతావరణ అంశాలు కారణంగా చూపింది. అయితే మానవ ప్రమేయంతో కూడా బారీ స్థాయిలో కాలుష్యం పెరుగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తేత ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా సాంద్రత మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీని వల్ల వాహనాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కాలుష్యం వల్ల భారత్ తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి 6 ఏళ్లకు పైగా తమ జీవిత కాలాన్ని కోల్పోతున్నట్లు ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News