తెలంగాణలో కాంగ్రెస్ దూకుకు పెంచింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. విజయభేరి సభా వేదికగా ప్రకటించిన 6 గ్యారెంటీలపై విస్తృత ప్రచారం కల్పించడం సహా.. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాల్ని జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) సమాలోచనలు కొనసాగుతున్నాయి. ఒకే పేరు కలిగిన 30 నియోజకవర్గాల జాబితాను స్ర్కీనింగ్ కమిటీ.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ (Congress)అభ్యర్థుల ఎంపిక కసరత్తులో జోరు పెంచిన కాంగ్రెస్.. విస్తృతంగా జనంలోకి వెళ్లడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఇతర సీనియర్ నాయకులంతా ఇందులో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్రతో సమాంతరంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
ఇప్పటికే దిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై లోక్‌సభలో చర్చ, ఓటింగ్ ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ రాలేకపోయారు. దాంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణిక్‌రావ్ ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్దిఖీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ప్రాథమిక చర్చకు పరిమితమయ్యారు.అదే సమయంలో లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభం కావడంతో రేవంత్(Revanth Reddy), కోమటిరెడ్డి, ఉత్తమ్ వెళ్లిపోయారు. అనంతరం మిగతా సభ్యులు కొంతసేపు చర్చించి, సమావేశాన్ని ముగించారు. లోక్‌సభలో బిల్లులు, చర్చల ఆధారంగా ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఆధారపడి ఉంటుందని భట్టి తెలిపారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపిక వేగంగానే చేస్తామని, తొలి విడతలో 50 నుంచి 55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
అదే సమయంలో లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభం కావడంతో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ వెళ్లిపోయారు. అనంతరం మిగతా సభ్యులు కొంతసేపు చర్చించి, సమావేశాన్ని ముగించారు. లోక్‌సభలో బిల్లులు, చర్చల ఆధారంగా ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఆధారపడి ఉంటుందని భట్టి తెలిపారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపిక వేగంగానే చేస్తామని, తొలి విడతలో 50 నుంచి 55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
Telangana Congress Bus Yatra 2023 :