Monday, December 23, 2024
Home క్రైమ్ Abdullapurmet tragedy: భార్య, కొడుకును దారుణంగా చంపి.. తాను ఉరేసుకున్నాడు

Abdullapurmet tragedy: భార్య, కొడుకును దారుణంగా చంపి.. తాను ఉరేసుకున్నాడు

by Mahadev
0 comment 46 views
Young woman suicide

తెలంగాణలోని రంగారెడ్డి జల్లా అబ్దుల్లాపూర్(Abdullahpur) మెట్ మండలం అనాజ్‌పూర్(Anajpur) లో దారుణం జరిగింది. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కిరాతకంగా హతమార్చాడో దుర్మార్గుడు. తాజాగా ఆ కిరాతకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య(suicide)కు పాల్పడ్డాడు. అనాజ్‌పూర్ లో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఏర్పుల ధన్‌రాజ్(Erpula Dhanraj) అనే వ్యక్తి ఆవేశంతో భార్యా కొడుకులను హతమార్చాడు. భార్య లావణ్య(23)ను సీసాతో పొడిచి, గొడ్డలితో నరికి(Chop with an axe) దారుణంగా చంపాడు. నెలన్నర వయస్సు ఉన్న కొడుకు క్రియాన్ష్ ను నీటి సంపులో పడేసి ఉసురు తీసుకున్నాడు. తల్లిని, తమ్ముడిని అతి కిరాతకంగా చంపుతున్న తండ్రిని చూసి భయపడి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తడంతో రెండున్నరేళ్ల కూతురు ఆద్య ప్రాణాలతో బయట పడింది.

నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న ధన్‌రాజ్‌ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే గత నెలనే ధన్‌రాజ్ (Dhanraj)బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కందుకూరు పరిధి జబ్జార్‌గూడ ప్రాంతంలోని తన సోదరి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాగా.. రెండు రోజుల క్రితం అనాజ్‌పూర్ లోని తన ఇంటికి వచ్చాడు. బెయిల్ పై వచ్చిన ధన్‌రాజ్‌ తో మాట్లాడేందుకు బంధువులు, గ్రామస్థులు విముఖత చూపారు. దీంతో ధన్‌రాజ్ ఇంట్లో, బయటా ఒంటరిగా ఉంటూ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం తండ్రి బాలయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లగానే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ధన్‌రాజ్.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ధన్‌రాజ్‌ కుమార్తె ఆద్య అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాలలోని అమ్మమ్మ, తాతయ్యలతో ఉంటోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కంటుకున్న భార్యను, కన్న బిడ్డను చంపి.. బంధుమిత్రులకు దూరమై.. ఏకాకిగా మిగిలిన ధన్‌రాజ్.. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News