మన వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు మసాల కూరల్లోకి, బిర్యాని వండుకోవడానికి కాదు. ఆరోగ్య సమస్యల ఉన్నప్పుడు ఉపయోగిస్తే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. తీసుకున్న ఆహారం వల్లగానీ, శరీరంలోని వేడి ఎక్కువగా ఉన్నా నోటి దుర్వాసన వస్తుంది. దీన్ని వెంటనే అరికట్టాలంటే మూడు, నాలుగు లవంగాలు నోటిలో వేసుకొని నిదానం నమిలితే నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. దంతాలు,చిగుళ్ల సమస్యలను లవంగాల పొడిగా చేసుకొని ఉపయోగిస్తే సమస్యలు తగ్గుతాయి. ప్రయాణ సమయంలో గానీ, తిన్న ఆహారం జీర్ణ సమస్య ఉన్నప్పుడు వికారం, వాంతులు ఉంటుంది. అప్పుడు లవంగాలు వేసుకుంటే సరి. ఇట్టే తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును అరికడుతాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. వ్యాధి నిరోదక శక్తిని పెంచుతాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. కాలేయ మరియు చర్మసమస్యలను నివారిస్తాయి.
లవంగాల ఆరోగ్య ప్రయోజనాలులవంగాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆహారం రుచి పోషణను పెంచుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ కె మాంగనీస్ ఉంటాయి. మాంగనీస్ మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడే ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుందిలవంగాలలో తక్కువ కేలరీలు ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఇది బరువు పెరగకుండా చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇది శరీరం జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మంచి జీవక్రియ రేటు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల సూక్ష్మ క్రిముల నుంచి, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. లవంగాలను రోజూ తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుద్ధి చేస్తాయి. మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.