చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్1(ADITYA L1) వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది ఇస్రో(ISRO). తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి57(PSLVC-57) వాహకనౌక ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. మొదటి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఆదిత్య ఎల్-1.
తొలుత ఆదిత్య ఎల్-1(ADITYA L1) ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.
సూర్యుడి ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 మిషన్ పని. ఈ మిషన్ ద్వారా సూర్యుడి వెలుపలి పొర గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఆదిత్య ఎల్1 అనేది ఒక ఉపగ్రహం. వీటిని 15 లక్షల కిలోమీటర్ల దూరానికి పంపించే ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్ 1 అంటే లాగ్రాంజ్ పాయింట్ 1లో అమర్చాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ లేని ప్రాంతాన్ని ‘లాగ్రాంజ్ పాయింట్’ అంటారు. ఈ ఎల్ 1 బిందువు వద్ద ఆదిత్య ఎల్ 1 సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు ఈ ఎల్ 1 పాయింట్ నుంచి ఇప్పుు వెళ్లే ఆదిత్య ఉపగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపదు. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(EUROPEAN SPACE AGENCY), ఆస్ట్రేలియా(AUSTRALIA), ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.
ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(VISIBLE ANIMATION LINE CORONAGRAPHY), ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు ఉన్నాయి.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్(ELECTROMAGNETIC), మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల(MAGNETIC FIELD DETECTORS) సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్(PHOTO SPHERE), క్రోమోస్పియర్(CHROMOSPHERE)ను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.