ఈ మేకప్ గురించి తెలుసా మీకు?
కంగనా రనౌత్ నుంచి కాజోల్ వరకు, నయనతార నుంచి మనీ హీస్ట్ ఫేమ్ అల్వారో మోర్టే వరకు, అంతేకాదు షారుక్ ఖాన్ లా కూడా.. ఆమె తలచుకుంటే ఎవరిలా అయినా మారిపోగలదు. ఎలా అనుకుంటున్నారా..అది ప్రోస్థటిక్ మేకప్ టెక్నిక్‌లతో అచ్చంగా వారిలానే తన రూపుని మార్చేసుకుంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తాను కూడా సెలబ్రిటీ అయిపోయింది. మిలియన్ల ఫాలోయర్లు ఉన్న దీక్షిత స్టోరీ…
ఢిల్లీలో పుట్టి పెరిగింది ఈ మేకప్ ఆర్టిస్ దీక్షితా జిందాల్. చిన్నప్పటి నుంచి అలంకరణలు అంటే ఇష్టం ఉండటం.. స్కూల్లో ఉన్నప్పుడే
హెయిర్‌స్టైల్, మేకప్ వీడియోలు చూసి రకరకాల ప్రయోగాలు చేయడం ఆమెకు మేకప్ రంగం మీద ఇంకా ఆసక్తిని పెంచేసాయి. అప్పటిలో దీక్షిత పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియోలుకి మంచి ఫాలోయింగ్ అభినందనలు పెరిగాయి. దీంతో ఇన్ స్టాగ్రాములోను అడుగు పెట్టి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను అని తెలుపుతుంది దీక్షిత. ఆ వీడియోలకి మంచి ఆదరణ లభించడంతో బ్రాండ్ల నుంచి ప్రమోషన్ల ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా వచ్చిన డబ్బులుతోనే మొదటిసారి ఓ మంచి మేకప్ కిట్ కొనుక్కున్నా’ అంటోంది దీక్షిత.
ఆ సమయంలోనే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆర్టిస్ట్ ‘అలెక్సిస్ స్టోన్’ చేసిన కిమ్ కర్దాషియాన్ మేకప్ చూసి తాను ఆలా ప్రయత్నాలు మొదలుపెట్టింది దీక్షిత. ఆ ప్రయత్నాల్లో ఆమెను ఎంతో మంది నిరాశపరిచిన.. తాను సాధించగలను అనే నమ్మకంతో ముందుకి వెళ్ళింది దీక్షిత. మొదటిగా ఫేస్ పెయింటింగ్, ఇల్యూజన్ మేకప్‌ల సాయంతో ‘సాత్ నిభానా సాథియా’లోని కోకిలా బెన్ పాత్రలా మారిపోయి వీడియోను పోస్ట్ చేయగా.. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ తరువాత తాను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఎవరు ఎన్ని అన్ని తాను అనుకున్న దారిలోనే నడిచింది దీక్షిత. నిజానికి ఒక్కొక్కరి ముఖాకృతి ఒక్కో విధంగా ఉంటుంది. అచ్చంగా ఆ వ్యక్తిలాగే కనిపించాలంటే ముందు వారి ముఖ కవళికలూ, ఆకృతి వంటివి అర్థం చేసుకోవాలి. తర్వాతే మేకప్.. అది పూర్తి చేయాలంటే కనీసం 10 నుంచి 15గంటల సమయం పడుతుంది. దీనికి ఎంతో ఓపిక అవసరం.. కానీ, ఇష్టంతో చేసిన పని ఏదైనా కష్టం అనిపించదు అంటుంది దీక్షిత. విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, రేఖ అనుపమ్ ఖేర్, మైఖేల్ జాక్సన్ వరకూ ఎంతో మంది ప్రముఖుల రూపాలను దీక్షిత పునః సృష్టించింది. ఇప్పుడు కెనడాలో అధునాతన ప్రోస్థటిక్ మేకప్ ఎఫెక్ట్స్‌ని నేర్చుకుంటోంది. నేర్చుకున్న కళకు తన అభిరుచిని జోడించి అద్భుత రూపాలుగా మార్చాలనుకుంది. అలా ఇప్పటివరకూ సుమారు 100 మంది భారతీయ ప్రముఖుల ముఖాలను మేకప్‌తో పునః సృష్టించింది. అదే ఆమెకు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోయర్లను అందించింది.