ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(AP SKILL DEVELOPMENT CASE)లో అరెస్ట్(ARREST) అయిన టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) రిమాండ్(REMAND)ను మళ్లీ పొడిగించింది విజయవాడ(VIJYAWADA)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక న్యాయస్థానం(SPECIAL COURT). ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో రిమాండ్‌లో ఉండగా.. ఆయన రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో.. వీడియో కాన్ఫరెన్స్(VIDEO CONFERENCE) ద్వారా చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు జైలు అధికారులు. ఆ తర్వాత రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.. రిమాండ్ విచారణలో జైలులో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా? అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. జైలులో ఎలాంటి పరిస్థితి ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు చంద్రబాబును విచారించేందుకు సీఐడీ(CID) 5 రోజుల కస్టడీ(5 DAYS CUSTODY) కోరుతుండగా.. దీనిపై చంద్రబాబు అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు న్యాయమూర్తి. ‘సీఐడీ వాళ్లు మిమ్మల్ని కస్టడీకి కోరుతున్నారు. మీ న్యాయవాదులు కస్టడీ వద్దంటున్నారు.. సీఐడీ కస్టడీపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగి తెలుసుకున్నారు.. అయితే.. చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తు్న్నట్టు పేర్కొన్నారు న్యాయమూర్తి. దీంతో.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు గడపాల్సి ఉంటుంది. ఇక, చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ రోజుకు వాయిదా పడిన విషయం విదితమే కాగా.. మరికొద్ది సేపట్లో దానిపై కూడా తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.