రామ్ చరణ్‌కు అరుదైన గుర్తింపు.. జూ.ఎన్టీఆర్ జాబితాలో చోటు..!
Ram Charan: అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అకాడమీ ప్రతినిధులు సమాచారం అందించారు. వెండితెరపై అత్యున్నత ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నారు. నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఇలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’ అంటూ ప్రకటించింది.
96వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ 2024 మార్చిలో జరుగనున్నాయి. టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో పాటు హాలీవుడ్ నటులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కాగా, ఇంతకుముందే జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ లిస్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా రాం చరణ్ చోటు దక్కించుకున్నాడు. ఈమేరకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు.
ఇక రాబోయే రాం చరణ్ సినిమాల గురించి మాట్లాడితే.. శంకర్‌తో తీయబోయే ‘గేమ్ ఛేంజర్’ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీపావళికి తొలిపాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది.