ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy)ద్రుష్టి సారించారు. రానున్న ఎన్నికలకు సిద్ధమవడమే ఎజెండాగా ఆ పార్టీ అధినేత జగన్ ఇవాళ వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయం(Chief Minister Vice Jagan Mohan Reddy)లో నిర్వహించే ఈ సమావేశానికి.. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జగనన్న గృహ సారథుల సమన్వయకర్తలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు కార్యాచరణను జగన్ ప్రకటించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి 16 నెలలైనా, మధ్యలో హెచ్చరించినా పూర్తిస్థాయిలో పాల్గొనని ఎమ్మెల్యేల భవితవ్యంపైనా.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టతనిస్తారని చెబుతున్నారు.
గడప గడపకు(Gadapa gadapaku mana prabutvam) కార్యక్రమం ముగింపు సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఎజెండా ప్రకటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ఈ సభల్లో మాట్లాడాలని.. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడానికీ వీటిని వినియోగించుకునేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనేలా రూపొందించిన ప్రణాళికను వెల్లడిస్తారని తెలుస్తోంది.
స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీల సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున(Minister Merugu Nagarjuna) అన్నారు. ఏపీ చరిత్రలో దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం దివంగత వైఎస్సార్ అయితే, ఆయనకంటే మిన్నగా ఎస్సీల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్న నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీబీటీ(DBT), నాన్ డీబీటీ పథకాల ద్వారా ఎస్సీల కోసమే ఏకంగా రూ.63,689 కోట్లు ఖర్చు చేశామన్నారు. శాసనసభ సమావేశాల మూడో రోజు సోమవారం ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల్లో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి నాగార్జున సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాల్లో లబ్ధి ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా పొందుతున్నారని చెప్పారు.
డీబీటీ ద్వారా వసతి దీవెన కింద రూ.834.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.2,081.54 కోట్లు, జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రూ.14.97 కోట్లు, రైతు భరోసా కింద రూ.3,202.15 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.83.38 కోట్లు, ఉచిత పంటల బీమా ద్వారా రూ.393.06 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.160.23 కోట్లు, మత్స్యకార భరోసా రూ.6.10 కోట్లు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.817.61 కోట్లు, పెన్షన్ కానుక రూపంలో రూ.13,410.52 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.3,353.37 కోట్లు, ఆసరా కింద రూ.3,721.92 కోట్లు, వైఎస్సార్ బీమా కింద రూ.449.40 కోట్లు, నేతన్ననేస్తం కింద రూ.10.61 కోట్లు, చేదోడు కింద రూ.71.19 కోట్లు, లా నేస్తం రూపంలో రూ.8.85 కోట్లు, వాహన మిత్ర కింద రూ.244.91 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద రూ.170.94 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.1,425.81 కోట్లు, కళ్యాణమస్తు కింద రూ.102.25 కోట్లు.. ఇలా పలు పథకాల కింద మొత్తంగా రూ.60,530.71 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు.