తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి, టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ దివి. బిగ్ బాస్ సీజన్ 4లో పాపులారిటీని సంపాదించుకున్న ఈ నల్లకలువ అందాల తార.. ఆ తర్వాత మంచి క్రేజ్ దక్కించుకుంది. పలు సినిమాల్లోనూ మెరిసింది. అయితే అవన్నీ చిన్న పాత్రలే కావడం వల్ల స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. కానీ వచ్చిన అవకాశాలను మాత్రం అస్సలు వదులుకోవట్లేదు. తన పాత్రలకు న్యాయం చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన ఫాలోవర్స్, అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది.
ఎక్కువగా చీరలో ఫొటోషూట్స్ చేస్తూ తన ఒంపుసొంపులతో కుర్రాళ్ల మనసును దోచేస్తోంది. తాజాగా మరో సూపర్ పిక్‌ను షేర్ చేసింది. జాకెట్ లేకుండా పైట కొంగుతో అందాలు దాచుకుని బ్యాక్ చూపిస్తూ పోజు ఇచ్చింది. ‘అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ.. నీ రాకకై ఎదురుచూస్తూ.. నే నీకోసం చేస్తున్న నిరీక్షణ.” అంటూ ఓ రొమాంటిక్ కోటేషన్‌ను షేర్ చేసింది. ఆమె బోల్డ్ అవతార్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
గాడ్ ఫాదర్ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు నటి దివి. ఆమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన దివి.. ఆ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో వుండే కమిట్‌మెంట్ గురించి తన అభిప్రాయాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కమిట్‌మెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే.. మమ్ముల్ని అడగలేదని ఎవరైనా అంటే అది పెద్ద నిజం కాదు అని తెలిపారు.
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ విషయం ఒక్కోక్కు ఒక్కో విధంగా వుంటారని, కొందరికి కెరియర్‌లో ఎదగాలి అని వుంటుంది.. వారు ఈ ఇలాంటి విషయాలను పట్టించుకోరు.. అడగ్గానే లోంగిపోతారు. మరి కొందరు ఆ పని చేయటానికి మనసొప్పక సున్నితంగా తిరస్కరిస్తారని.. అయితే ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే అది తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదని.. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం పెద్ద తప్పు అంటూ మాట్లాడారు.. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.