చిన్నచిన్న సమస్యలను(Issues) కూడా బూతద్దంలో చూస్తున్నారు. తీరా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అసలు ఈ గొడవలు(Fighting) అవసరమా అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు. తమ చిన్న కోరికలు(Desires) తీర్చుకోవడం కోసం దొంగతనాలు, హత్యకు, మానభంగాలు ఇలా అనేకం చేసుకుంటూ పోతున్నారు. కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు ఇలా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు అహంకారానికి పోయి ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
పశువులను గడ్డి(Gross) మేపుకొనే విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ కాస్తా రెండు వర్గాల మధ్య కాల్పులకు(firing) దారితీయడంతో, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దతియా(Datia) జిల్లాలోని రెండా గ్రామంలో ప్రకాశ్ దంగి, ప్రీతం పాల్ అనే వ్యక్తుల మధ్య పశువుల గడ్డి విషయంలో మూడు రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో అనేక సార్లు ఒకరిపై ఒకరికి గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆలా చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి.. ప్రీతంను ప్రకాశ్ చెంపదెబ్బ కొట్టాడు.
దీనిపై దంగి, పాల్ వర్గాల వారు(Dangi and Pal communities) పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవడంతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ రెండు వర్గాల వారు బుధవారం మళ్లీ గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. ఆ సమయంలో పరస్పరం కాల్పులు జరపడంతో ఐదుగురు మరణించారు.విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారు క్షేమంగానే ఉన్నారు.