హైదరాబాద్‌లోని మైహోం అపార్ట్మెంట్లో 15 సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపుర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మై హోం అపార్ట్మెంట్లో హెచ్ బ్లాక్‌లో సురేష్‌రెడ్డి భార్య తమ కుమారుడు రేయాన్ష్ రెడ్డి(15) నివసిస్తున్నారు. సోమవారం రేయాన్ష్ తన తల్లికి చనిపోతున్నానని చరవాణికి మెసేజ్ పంపించాడు. అందులో తాను పర్సనల్ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉంది. ఈ మెసేజ్ చదివిన తల్లి కుమారుడు కోసం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వెతికింది. ఎంత గాలించిన ఆచూకీ దొరకలేదు. చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు.
వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం.. మైహోమ్స్ అపార్ట్‌మెంట్‌ని పరిశీలించారు. బాలుడు కనిపించలేదని నిర్ధారించకా.. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను చూశారు. అందులో ఆ బాలుడు బయటకి వెళ్లలేదని తెలుసుకున్నారు. ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నాడని.. మరింతగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అన్ని బ్లాక్‌లు పరిశీలించని తరువాత.. ముడో గేట్ ఎంట్రన్స్‌లోని జే బ్లాక్ డక్ ఏరియాలో విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు.
విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా.. సోమవారం రాత్రి సుమారు 7:30కి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. జే బ్లాక్‌లోని 34వ ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణం చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బాసినకావడం, చదువులో ఒత్తిడి వల్లే చనిపోయి ఉండాడని అంతా భావిస్తున్నారు. అయితే చదువుపై ఒత్తిడి, ఆన్లైన్ గేమ్స్.. ఇలాంటి ఏవి తమ దృష్టికి రాలేదని ఏసీపీ స్పష్టం చేశారు. అయితే విద్యార్థి ఆత్మహత్యనే? కాదా? చనిపోడానికి కారణాలు ఏమిటి? చనిపోడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేశాయి? తల్లితో పాటు చివరి సారి ఇంక ఎవరికైనా మెసేజ్ పంపించాడా? పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి తండ్రి ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ముంబయి నుంచి గత సంవత్సరం హైదరాబాద్‌కి వచ్చారు.