ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ‘కాపు’ కాసేదెవరికి..?
ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి… రానున్న ఎన్నికల వేళ్ల నయా లెక్కలు రాజకీయ తెరమీదికి వస్తున్నాయి… ఏపీ సీఎం అనూహ్యంగా జగన్ ఇంచార్జిలను మారుస్తూ.. అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ జగన్ దగ్గర తీసే దిశగా అడుగులు పడుతున్నాయి.. దీంట్లో భాగంగా ముద్రగడ కుమారుడికి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. కాగా…. కాపు ఓటర్లు జనసేనానితోనే ఉంటారని టాక్.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఏపీలోని ప్రధాన పార్టీలను పేరెత్తకుండానే విమర్శలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. మాజీ జేడీ గతంలో జనసేనలో పనిచేశారు. ఎంపీగానూ పోటీ చేశారు. తరువాత ఆ పార్టీని వీడి… ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు. జేడీ కొంతకాలంగా రిటైర్ఢ్ సివిల్స్ అధికారులతో పార్టీ ఏర్పాటుపై చర్చలు చేసిన తరువాతే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గతంలో జనసేనలో పనిచేసి పార్టీ వీడిన నేతలు లక్ష్మీనారాణయణతో కలిసి వస్తామని చెప్పినట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ – జనసేనతో కలవ లేని వారి తమతో కలుస్తారనేది లక్ష్మీనారాయణ మద్దతు దారుల అంచనాగా కనిపిస్తోంది.
కాగా.. ఇటు కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీకి దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుమారుడు రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి తాజా నిర్ణయాలతో ఇప్పుడు కాపు ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. జగన్‌ను ఓడించాలంటే ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం చూపుతారని.. తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌తో బాబు జత కట్టారు. కానీ, పవన్ కల్యాణ్ తాను సీఎం కావాలనే అభిమానులు.. జనసైనకుల కోరికకు భిన్నంగా చంద్రబాబు సీఎం అవుతారని ప్రచారం చేయడం… పలువురు కాపు నేతలకు నచ్చడం లేదు. దీంతో.. వారు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.
స్పాట్ : ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్, చంద్రబాబు విజువల్స్
ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వారికి ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే… లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో ఎవరెవరు ఉంటారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ నిర్ణయానికి…. గండి పడే అవకాశం కనిపిస్తోంది. పవన్ సీఎం కారని లోకేష్ చెప్పడంతో… జనసేనానికి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న హరిరామ జోగయ్య లాంటి వారు విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న పవన్‌ను వ్యతిరేకంచే నేతల తీరుతో… రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.