మనకున్న ఆదాయ మార్గాల్లో వేతనం, అద్దెలు, క్యాపిటల్ గెయిన్స్ వంటి వాటిని ఆదాయపు పన్ను ఉంటుంది. అయితే.. ఐటీ పరిధిలోకి రాని కొన్ని ఆర్థిక వనరులూ ఉన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 10 పన్ను కింద మినహాయింపు పొందగల ఈ వనరులేమిటో తెలుసుకుందాం.
ఈపీఎఫ్ డిపాజిట్
ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోని మొత్తంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. యజమాని డిపాజిట్ చేసిన ఈపీఎఫ్ మొత్తంపైనా ఈ మినహాయింపు ఉంటుంది. కానీ.. ఈ మొత్తం ఉద్యోగి మూలవేతనంలో 12%కి మించితే.. దానిపై ఐటీ తప్పదు.
పెళ్లి బహుమతులు
వివాహ సమయంలో బంధుమిత్రుల నుంచి పొందిన రూ. 50 వేల విలువ కంటే తక్కువ ఉన్న బహుమతి మీద పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అయితే వివాహం జరిగి 6 నెలలు దాటితే దానికి లెక్క చెప్పాల్సిందే.
పొదుపుపై వడ్డీ
సేవింగ్స్ ఖాతాలోని మొత్తం మీద ఏడాదికి రూ. 10 వేల లోపు వచ్చే వడ్డీకి ఐటీ నుంచి పన్ను మినహాయింపు ఉంది. అంతకు మించితే ఐటీ తప్పదు.
భాగస్వామ్య సంస్థ నుంచి లాభం
మీరు భాగస్వామిగా ఉన్న సంస్థ నుంచి వచ్చిన లాభం మీద ఐటీ ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే ఆ సంస్థ ఇప్పటికే దానిపై పన్ను చెల్లించింది. అయితే.. ఈ మినహాయింపు కేవలం సంస్థ లాభం మీదే తప్ప దాని నుంచి మీరు పొందే వేతనం మీద కాదు.
జీవిత బీమా క్లెయిమ్
జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసినా లేదా దాని మెచ్యూరిటీ టైంలో వచ్చే మొత్తం మీద ఐటీ ఉండదు. అయితే.. పాలసీ వార్షిక ప్రీమియం దాని హామీ మొత్తంలో 10% మించకూడదు.
VRS మొత్తం
ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో చేసే ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తే.. వచ్చిన మొత్తంలో రూ. 5 లక్షల వరకు ఐటీ మినహాయింపు ఉంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ మినహాయింపు లేదు.
సాగు ఆదాయం
వ్యవసాయం లేదా అనుబంధ కార్యకలాపాలపై వచ్చే ఆదాయం మీద ఎలాంటి ఐటీ ఉండదు. ఇందులో దిగుబడి, కౌలు మొత్తం మొదలైనవి కూడా ఉంటాయి.