కిడ్నీలు మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇవి శరీరం నుంచి మూత్రం, విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. మూత్రపిండాలు రక్తం నుంచి అదనపు నీటిని, వ్యర్థాలను తొలగించి.. మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. మూత్రపిండాలు నత్రజని, పొటాషియం, సోడియం, ఫాస్ఫేట్ వంటి పదార్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. మూత్రపిండాలు ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కిడ్నీలు ప్రేరేపిస్తాయి. కిడ్నీలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే.. వాటిలో విషపదార్థాలు పెరుకుపోతాయి. దీని కారణంగా, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులను కలిగించవచ్చు. మీ కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఆకుల గురించి డాక్టర్ కపిల్ త్యాగి ఈ స్టోరీలో వివరించారు.
పునర్నవ ఆకులకు శరీరం నుంచి మూత్రం, విషాన్ని తొలగించే సామర్థ్యం ఉంది. ఇది మూత్రపిండాల నుంచి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. పునర్నవ మూత్ర నాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ ఆకుకూర కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి, మెరుగ్గా పనిచేయటానికి కావాల్సిన పోషణనిస్తుంది. ఇందుకోసం పునర్నవ ఆకులను శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. ఈ ఆకులను నీటిలో మరిగించి, అవి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి తాగంండి. ఈ కషాయాన్ని రోజూ రెండు సార్లు తాగితే.. కిడ్నీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మీ ఆహారంలోనూ పునర్నవను చేర్చుకోవచ్చు.
కొత్తిమీరు మీ మూత్రనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో కిడ్నీలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లను నివారించడానికి, ఆ సమస్యను దూరం చేయడానికి కొత్తిమీరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం చిన్న కట్ట కొత్తిమీరను ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో మరిగించి, అందులో తరిగిన ఆకులను వేయాలి. దీన్ని మీడియం మంట సుమారు 5-10 నిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడకట్టి తాగండి. ఇలా చేస్తే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
పారిజాత ఆకులలో యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మూడు పారిజాత ఆకులను గ్లాసు నీటిలో మరిగించి తాగండి. రోజూ ఒక గ్లాస్ తాగితే మంచిది.
తులసి ఆకుల్లో యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని కోసం, కొన్ని ఆకులను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక కప్పు నీరు మరిగించి, అందులో తరిగిన ఆకులను జోడించండి. మీడియం మంట మీద 5-7 నిమిషాలు నెమ్మదిగా మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడపోసి.. తాగండి.
గోక్షుర ఆకులు మూత్ర నాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మూత్రపిండాల నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. కొన్ని గోక్షుర ఆకులను శుభ్రం చేసి.. చిన్న ముక్కలగా కట్ చేసుకోండి. ఒక కప్పు నీటిలో ఈ ఆకులు వేసి, 5-7 నిమిషాలు నెమ్మదిగా మరిగించాలి. ఈ టీ చల్లారిన తర్వాత, ఫిల్టర్ చేసి తాగండి. ఇవేకాకుండా.. మీ లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటూ, పోషకాహారం, తగినన్ని నీళ్లు తాగితే.. మీ కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.