ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మనుషుల మీదకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని రాంచీకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాన్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కారులోని వ్యక్తి నిద్ర మత్తు కారణంగా పక్క గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న మనుషుల గుంపు పైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు పక్క గ్రామంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో మృత్యువు కబలించడంతో తీవ్రంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను ఉదల్ చౌరాసియా (34), రోహిత్ చౌరాసియా (45), మధు మెహతా (30)గా గుర్తించారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ రిషవ్ గార్గ్ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా.. వారికి మేదినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు వెళ్లారు.. కేసు నమోదు చేసుకొని మృతులను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ సంఘటన తర్వాత డ్రైవర్ కారుతో పరారయ్యాడు.. అతనిని పట్టుకోవడానికి మాన్‌హాంట్ ప్రారంభించబడింది.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని రిషవ్ గార్గ్ తెలిపారు.