టీఎస్పీఎస్సీ లీకేజీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో మరో ముగ్గురి అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దీంతో.. 99కి అరెస్టుల సంఖ్య చేరింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈ ముగ్గురు నిందితులు ప్రవీణ్ కు సహకరించినట్లు సిట్ విచారణలో వెల్లడి కావడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది నాంపల్లి కోర్టు.
దీంతో మూడుసార్లు రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. సిట్ అధికారులు నిందితుల నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్ లను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు వెల్లడించిస్తున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరికొందరు నిందితుల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని సిట్ అధికారుల పేర్కొన్నారు.