ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టింది. బలమైన బీజేపీ ప్రభుత్వం ముందు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండియా కూటమిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టె అర్హత లేకపోయినా ప్రతిపక్షం దుస్సాహసం చేసిందని అధికార పక్షం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం గతంలో చాలాసార్లు ప్రవేశపెట్టారు.
దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకు అంటే 2023తో కలిపి లోక్‌సభలో మొత్తం 28 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. అందులో ఒక్కటి మినహా అన్నీ వీగిపోయాయి. మరి ఏ ప్రధాని ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారో తెలుసా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అయితే ఈ అవిశ్వాసంపై లోక్‌సభలో మూడు రోజులపాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మోదీ సమాధానం చెప్పాలనే డిమాండుతో విపక్ష పార్టీలు ఈ అస్త్రాన్ని ప్రయోగించగా తన సుదీర్ఘ ప్రసంగంలో మోడీ అనేక అంశాలను ప్రస్తావించారు. కానీ ప్రధాని మాట్లాడుతుండగానే విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడం వల్ల మూజువాణి ఓటుతో ఈ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన అవిశ్వాసాల తీరును పరిశీలిద్దాం.
దేశ స్వాతంత్ర్యానంతరం మొత్తంగా ఇప్పటివరకు 28సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొత్తం 14 మంది ప్రధానమంత్రుల్లో ఎనిమిది మంది వీటిని ఎదుర్కొన్నారు. సుదీర్ఘకాలం (పదేళ్లపాటు) అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ మాత్రం ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కొలేదు. ఆ ఒక్కటి మినహా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకు 2023తో కలిపి లోక్‌సభలో మొత్తం 28 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. అయితే వాటిలో ఒక్కటి మినహా అందులో అన్నీ వీగిపోయాయి. మొత్తం 27 అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ వరకు వెళ్లాయి. కేవలం మొరార్జీ దేశాయ్ హయాంలో అనగా 1979లో మాత్రమే ఓటింగ్ జరగకుండానే ఆయన రాజీనామా చేశారు.