Monday, December 23, 2024
Home జాతీయం Natraj idol: తమిళనాడు నుంచి ఢిల్లీకి నటరాజు విగ్రహం..

Natraj idol: తమిళనాడు నుంచి ఢిల్లీకి నటరాజు విగ్రహం..

by స్వేచ్ఛ
0 comment 73 views
nataraj idol

దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు రోజుల సమావేశాల కోసం ఢిల్లీ ఎంతో అందంగా ముస్తాబవుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే మరోవైపు మన సంస్కృతిని సైతం దీనిలో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారనుంది. దాదాపు 28 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా తమిళనాడు నుంచి తెప్పించారు.

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ వారు ప్రపంచంలోని అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని తయారు చేసారు. దేవా. రాధాకృష్ణన్, దేవా.పి.కందన్, దేవ స్వామినాథన్ తమ సహోద్యోగుల సహకారంతో ఆరు నెలల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. కుంభకోణం తాలూకాలోని స్వామిమలైలోని దేవ సేనాపతి శిల్పకళాశాలలో తయారు చేయబడిన ఈ విగ్రహానికి సంబంధించిన 75 శాతం పనులు పూర్తికావడంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ అచల్ పాండ్యా నేతృత్వంలోని బృందం, కేంద్రం అధికారులు జవహర్ ప్రసాద్, మనోహన్ దీక్షత్‌లతో కలిసి స్వామిమలై నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనిని జీ-20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక శాఖ నిర్మించిన ఈ విగ్రహాన్ని చోళ శైలిలో రూపొందించిండం ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత. ఈ సమ్మిట్‌లో అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు పలువురు ముఖ్యమైన విదేశీ నేతలు పాల్గొంటారు కాబట్టి.. భద్రతా కారణాల రీత్యా ఆ విగ్రహం పనులు పూర్తి కాకముందే రోడ్డు మార్గాన ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. మిగిలిన 25 శాతం పనులను పూర్తి చేసేందుకు స్వామిమలై నుంచి 15 మంది సిబ్బంది విగ్రహాన్ని పూర్తిగా రూపొందించేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ భారీ నటరాజ విగ్రహ విశేషాలను చూస్తే..

కంచుతో ప్రత్యేకించి తయారు చేసిన ఈ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 21 అడుగుల వెడల్పు, 25 టన్నుల బరువు ఉంటుంది. 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే మొదటి.. అతిపెద్ద నటరాజ కాంస్య విగ్రహం. ఈ విగ్రహంలో కంచుతో పాటుగా బంగారం, వెండితో సహా 8 లోహాలతో తయారు చేయబడింది. 6నెలల క్రితమే ఈ విగ్రహ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా విగ్రహం పూర్తయింది.

ఈ నటరాజ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదని, దీనిని ఢిల్లీకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనిని ట్రక్కులో ఇక్కడకు తీసుకువచ్చారు, ఇందులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఈ వాహనం తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి చేరుకుంది. శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో 19 టన్నుల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ అచల్ పాండ్యా నేతృత్వంలోని బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ్ విగ్రహం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని.. ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా, చైనా, కెనడా, యూకే సహా పలు పెద్ద దేశాల అధినేతలు ఢిల్లీ వస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం జీ-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News