జీ20(G20) సదస్సు నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) కీలక నిర్ణయం తీసుకుంది. జీ20 ఆంక్షల కారణంగా 160 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయ ప్రతినిధి ఈ విషయం వెల్లడించారు. ఈ కారణంగా కనీసం 80 విమానాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని, ఈ సమ్మిట్ జరిగే రెండు రోజుల పాటు విమానాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్పేస్(PARKING SPACE) కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఈ ఆంక్షలకు అనుగుణంగా కంపెనీలు ప్యాసింజర్స్‌కి సమాచారం అందిస్తున్నాయి. రీషెడ్యూల్ చేసుకోవాలని చెబుతోంది. విస్తారా, ఎయిర్ ఇండియా (VISTARA, AIR INDIA) సంస్థలు ప్యాసింజర్స్ ట్రావెలింగ్ డేట్స్(PASSENGERS TRAVELLING DATA)ని రీషెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ట్విటర్(TWITTER)లో అధికారికంగా పోస్ట్‌లు పెడుతున్నాయి. కొన్ని ఫ్లైట్స్‌ని రద్దు చేస్తున్నట్టు విస్తారా ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 8-11 మధ్య తేదీల్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు ఎప్పటికప్పుడు స్టేటస్‌ని చెక్ చేసుకోవాలని సూచించింది. రీషెడ్యూల్ చేసుకోని వాళ్లకు రీఫండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOVERNMENT) న్యూ ఢిల్లీ(NEW DELHI)లో కొత్త ఆంక్షలు అమలులోకి తీసుకురానుంది. దీని వల్ల ఆన్‌లైన్ డెలివరీ(ONLINE DELIVERY), కమర్షియల్ సర్వీసుల(COMMERCIAL SERVICES)పై ప్రతికూల ప్రభావం పడుతుంది.. అందులో భాగంగానే క్లౌడ్ కిచెన్(CLOUD KITCHEN), కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్(COMMERCIAL ESTABLISHMENTS), మార్కెట్లు(MARKETS), ఫుడ్ డెలివరీ(FOOD DELIVERY), కమర్షియల్ డెలివరీ సర్వీసు(COMMERCIAL DELIVERY SERVICES)లు అన్నీ కూడా మూడు రోజుల పాటు న్యూ ఢిల్లీలో అందుబాటులో ఉండవు. క్లౌడ్ కిచెన్ అండ్ ఫుడ్ డెలివరీ సర్వీసులకు అనుమతి ఇవ్వం అని ఇప్పటికే స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు.. అదే విధంగా అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ మొదలగు కంపెనీలకు కూడా పరిమితులు లేవని తెలుస్తుంది.. కంట్రోల్డ్ జోన్‌లో ఎలాంటి డెలివరీ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు..
సెప్టెంబర్ 9,10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో భారత్ మండపంలో ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రగతిమైదాన్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్‌లోనూ సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ఈ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం హాజరు కావడం లేదు. ఆయా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.