ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) ప్రభుత్వం(GOVERNMENT) 11 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ(TRANSFER) చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి(KS JAWAHAR REDDY) అధికారుల జాబితాకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవార నాడు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. విశాఖ పోలీస్ కమిషనర్(VISAKHA POLICE COMMISSIONAR) త్రివిక్రమ్ వర్మ(TRIVIKRAM VARMA)పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో రవిశంకర్(RAVI SHANKAR) అయ్యన్నార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ వర్మ ఐజీ క్యాడర్ లో ఉన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ గా ఐజీ స్థాయి అధికారులు ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఏడీజీ హోదాలో ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ను నియమించారు. అంటే.. పోలీస్ కమిషనరేట్(POLICE COMMISSIONARATE) ను అప్ గ్రేడ్(UPGRADE) చేసినట్లుగా భావిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్(EXCUTIVE CAPITAL) చేస్తామని ప్రభుత్వం(GOVERNMENT) చెబుతోంది. అదే సమయంలో.. విశాఖలో వివిధ రకాల నేరాలు పెరుగుతున్న సమయంలో.. కమిషనరేట్ ను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
త్రివిక్రమ్ వర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPECIAL PROTECTION FORCE) ఐజీగా నియమించారు. రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటి వరకూ నిర్వహించిన విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఏడీజీగా కుమార్ విశ్వజిత్(KUMAR VISHWAJEETH)గా పోస్టింగ్ ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్(SIDDHARTH KOUSHAL) నియమించింది. అనంతపురం(ANANTAPURAM) జిల్లా ఎస్పీగా అన్బురాజన్‌ను నియమించగా.. అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు(BODDEPALLI KRISHNA RAO)ను నియమించింది. ఇక.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్(JAGADEESH)ను నియమించగా.. గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడును నియమించింది. 14వ బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్. గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయీం అస్మీకి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తంపదకొండు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరంతా కీలక స్థానాల్లో ఉన్న వారే. అయితే ఎవరికీ ప్రాధాన్యం తగ్గించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ విశాఖ సీపీగా త్రివిక్రమ్ వర్మను తప్పించడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఆయనను గత ఏప్రిల్ లోనే విశాఖ సీపీగా నియమించారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బదిలీకి ప్రధాన కారణం.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారంగా భావిస్తున్నారు. ఈ అంశం విషయంలో ప్రభుత్వ పెద్దల్ని ఆయన సంతృప్తి పరచలేకపోయారని.. అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయాలు వినిపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. కొంత మంది ఎస్పీలు సుదీర్గ కాలంగా పని చేస్తున్నందున బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. కడప ఎస్పీ అన్బురాజన్ మూడేళ్లకుపైగా కడపలోనే విధులు నిర్వహిస్తున్నారు. అందుకే ఆయనను అనంతపురంకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.