పిన్ డ్రాప్ సైలెన్స్… ఎస్.. స్టేట్‌లో ప్రజెంట్ నెలకొన్న సిట్యువేషన్ ఇది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో తెలియడం లేదు. ముచ్చటగా మూడో సారి గులాబీ జెండా ఎగురుతుందా? లేక కాంగ్రెస్ హిస్టరీని రిపీట్ చేస్తూ తిరిగి అధికారంలోకి వస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అటూ ఇటుగా వస్తుండటంతో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది.
నిన్న ఎన్నికలు ముగియగనే మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచాయి. కాంగ్రెస్‌కు 50 సీట్లకు పైనే వస్తాయని తెలిపాయి. అయితే మరికొన్ని సంస్థలు మాత్రం మూడో సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏ పార్టీ అధికారంలో వస్తుందన్నది ఎవ్వరూ స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. ఓటరు దేవుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపాడో ఫలితాలు విడదలైతేగాని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇటు గాంధీ భవన్, అటు తెలంగాణ భవన్ ఈ రెండు పార్టీ ఆఫీసుల్లో ప్రస్తుతం నిశబ్ధవాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు సందడిగా ఉండే ఈ రెండు పార్టీ ఆఫీసుల్లో.. నేతలు ప్రస్తుతం ఎన్ని సీట్లు సాధిస్తామన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. పక్కగా వచ్చే సీట్లు ఎన్ని, ఏ నియోజకవర్గంలో పోలింగ్ సరళి ఎలా నడిచిందన్న దానిపై చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులకు హైరానా పడొద్దని సూచించారు. ఆగం కావాల్సిన అవసరం లేదని.. 3న సంబరాలు చేసుకుందామన్నారు.
ఇటు టీపీసీసీ చీఫ్ కూడా గెలుపుపై కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తున్నారు. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తేల్చిచెప్పారు. సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తే 5 నుంచి 10 స్థానాలే తెలంగాణలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఐదు నుంచి 10 సీట్ల తేడాతోనే కాంగ్రెస్,బీఆర్ఎస్‌లలో ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుదన్న అంచనాలు ఉన్నాయి.