రూ.500 గ్యాస్ సిలిండర్‌పై వదంతులు.. ఏజెన్సీల ముందు క్యూ కడుతున్న కస్టమర్లు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్పంపిణీ చేస్తుందని, ఇందుకోసం డాక్యుమెంట్లు తీసుకుంటోందని వస్తున్న వదంతులతో… ఐదు రోజులుగా వినియోగదారులు ఉదయం 6 గంటలకే ఆయా గ్యాస్ ఏజెన్సీల ఎదుట క్యూ కడ్తున్నారు. హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో పనులన్నీ పక్కన బెట్టి గ్యాస్ పాస్‌బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిలుచుంటున్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేక్కస్టమర్లను గుర్తించేందుకే తాము ఈ కేవైసీ చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీపం, ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకుని వినియోగిస్తున్న వారి ఈ కేవైసీ చేయాలని ఆర్డర్స్ఉన్నాయంటున్నారు. ఈ కేవైసీ రెగ్యులర్ ప్రాసెస్ అని, 500 రూపాలయకే గ్యాస్ పథకానికి, దీనికి సంబంధం లేదంటున్నారు. జనాలు మాత్రం ఇవేవీ వినకుండా కాళ్ల నొప్పులు పెడుతున్నా.. ఆకలితో కడుపులు కాలుతున్నా పని అయిపోయేంత వరకు గ్యాస్ ఏజెన్సీలను వదిలి వెళ్లడం లేదు.
ఏటా రాష్ట్రంలో ఫేక్ సమాచారంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. చనిపోయిన వారు, ఊళ్లు వదిలి వెళ్లిన వారి పేర్లతో తప్పుడు మార్గాల్లో గ్యాస్ సిలిండర్లు పొందుతున్న వారికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేలా ఈ కేవైసీ చేయాలని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ రెండు వారాల కింద సర్క్యులర్జారీ చేసింది. ఊరురా గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా డీలర్లు తమవద్ద గ్యాస్ సిలిండర్లు తీసుకునే కస్టమర్లు ఈ కేవైసీలో భాగంగా తమ ఆధార్ కార్డుతో వచ్చి.. థంబ్ ఇంప్రెషన్ వేసి ఫొటో దిగి వెళ్లాలని సూచించింది. తద్వారా తప్పుడు పద్ధతిలో గ్యాస్ సిలిండర్లు పొందేవారికి కేంద్ర సర్కారు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.
గ్యాస్ ఏజెన్సీల్లో వారం, పది రోజుల ముందు నుంచే నిర్వాహకులు కస్టమర్లకు ఈ కేవైసీ చేస్తున్నారు. ఈ నెల 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం 955 రూపాయలకే అందిస్తున్న గ్యాస్ ధరను… మూడో గ్యారంటీగా 500 రూపాయలకే అందిస్తున్నారని కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అందుకోసమే ఈ కేవైసీ చేస్తున్నారని.. ఇది చేసుకోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రాదని ప్రచారం చేశారు. ఇదికాస్తా ఊరురా పాకడంతో కొత్త సమస్యకు కారణమైంది.
ఈ కేవైసీ చేసుకోవాలని మొన్నటివరకు ఏజెన్సీలు సమాచారమిచ్చినా రాని జనాలు.. ఇప్పుడు ఈ కేవైసీ చేసుకోకపోతే సబ్సిడీ రాదని ప్రచారం జరగడంతో వందలాదిగా తరలివస్తున్నారు. తెల్లారకముందే గ్యాస్ ఆఫీసుల ఎదుట బారులు తీరుతున్నారు. దీంతో మూడు కంప్యూటర్లు, నలుగురైదుగురు సిబ్బందితో ఉండే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కోసారి గంటల తరబడి సైట్ ప్లాబ్రం, నెట్‌వర్క్స్‌లో ఉండడంతో పూర్తి కావడం లేదు. జనాలు మాత్రం తమ పనులు వదుకుని.. తిండీ తిప్పలు మాని ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలోనే నిల్చుంటున్నారు. ఈ జిల్లా ఆ జిల్లా.. ఈ గ్యాస్ కంపెనీ, ఆ గ్యాస్ కంపెనీ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీల ముందు తిప్పలు పడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొంత క్లారిటీ ఇస్తే సమస్య తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఆయిల్ కంపెనీల ద్వారా ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ కేవైసీతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‍కు ఎలాంటి సంబంధం లేదని సివిల్ సప్లయి అధికారులు అంటున్నారు. సబ్సిడీ కింద 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గైడ్‍లైన్స్ రిలీజ్చేయలేదన్నారాయ… జిల్లాల్లో కూడా మేము ఎలాంటి ప్రాసెస్ చేయడం లేదని, ఈ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేవైసీ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఫేక్ ప్రచారాన్ని పబ్లిక్ నయ్యవద్దన్నారు..