తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ.. ప్రచారంలో దూకుడు పెంచింది హస్తం పార్టీ. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగా.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఇక.. రేపు మరో మూడు నియోజకవర్గాల్లో రాహుల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఆందోల్, సంగారెడ్డి, కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉంటే.. మరోవైపు.. తెలంగాణలో రెండోరోజు ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పాలేరు, సత్తుపల్లి, మధిరలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే.. హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో డీకే శివకుమార్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో డీకే పాల్గొననున్నారు.
ఇంకోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జుక్కల్, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తిలో రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.