సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌కు తీవ్ర తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ చాలా ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ రెండు విడతల్లో 100 స్థానాలను ప్రకటించగా.. నాలుగు సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించగా మిగిలిన 15 సీట్ల విషయంలో కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సీట్లు ఎవరికి ఇస్తారని ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ 45 మందితో సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. ఇటీవల 55 మందితో తొలి జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్.. 45 మందితో సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. అయితే ఇంకా 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఫస్ట్ లిస్టులో చోటు దక్కిన సీనియర్ నేతలకు సెకండ్ లిస్టులో చోటు దక్కింది. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, తుంగతుర్తి వంటి కీలక స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయలేదు..
పెండింగ్‌లో ఉన్న 15 స్థానాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేసింది. తమ అనుచరులకే సీట్లు కేటాయించాలని సీనియర్ నేతలు ఒత్తిడి చేయడంతో స్క్రీనింగ్ కమిటీ చేతులెత్తేసింది. వాటిపై నిర్ణయాన్ని పార్టీ చీఫ్ మల్లిఖార్జునఖర్గేకు వదిలేసింది. పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపిక అధిష్టానమే చూసుకుంటుందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు.